
హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో పోటీపడుతున్న ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు వన్డేల్లో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది. అయినా నాలుగో వన్డేలో మాత్రం 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 197 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 37 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
స్పిన్నర్ అదిల్ రషీద్ (3/49)తో పాటు మిగతా ఇంగ్లాండ్ బౌలర్లూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ టిమ్ హెడ్ (96; 107 బంతుల్లో 15×4) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును విజయం వైపు నడిపించాడు.
అంతకుముందు ఇంగ్లాండ్ అతి కష్టంపై 196 పరుగులు చేసింది. కమిన్స్ (4/24), హేజిల్‌వుడ్ (3/39)ల ధాటికి ఒక దశలో ఆ జట్టు 8 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ఆరంభంలోనే తడబడిన జట్టును కెప్టెన్ మోర్గాన్ (33), మొయిన్ అలీ (33) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
కుర్రాన్ (35)తో కలిసి క్రిస్ వోక్స్ (78; 82 బంతుల్లో 4×4, 5×6) ఇంగ్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివరి వన్డే పెర్త్‌లో ఆదివారం జరుగుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.