15 ఏళ్ల ప్రేమాయణం.. పెళ్లికి ముందే తల్లిగా.. స్టార్ క్రికెటర్ క్రేజీ లవ్ స్టోరీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వివాదం తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ కొందరు జెస్సికాను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపుల గురించి జెస్సికా సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. మ్యాట్ ముగిసిన అనంతరం కోహ్లీ షేక్ హ్యాండ్ చేయకుండా వెళ్లిపోవడం.. ఆ తర్వాత అభిమానులు హెడ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంపై క్రీడా లోకంలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం వల్ల వార్తల్లోకి వచ్చిన ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
స్కూల్ డేస్ నుంచి స్నేహం.. 15 ఏళ్ల ప్రేమాయణం
ట్రావిస్ హెడ్, జెస్సికా డేవిస్ లవ్ స్టోరీ పక్కా సినిమా కథలాగే ఉంటుంది. వీరిద్దరూ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జన్మించిన జెస్సికా.. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. అడిలైడ్ నార్త్ డౌన్‌టౌన్‌లోని ట్రినిటీ కాలేజీలో స్కూల్ రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ జంట.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ నుంచి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జెస్సికా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన స్టైలిష్ ఫోటోలతో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

పెళ్లికి ముందే తల్లిగా.. ఆ తర్వాతే వివాహం
చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట 2021 మార్చిలో అధికారికంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే వీరు పెళ్లి బంధంతో ఒకటవ్వడానికి ముందే తల్లిదండ్రులు అయ్యారు. సెప్టెంబర్ 2022 లో జెస్సికా ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపకు 'మిలా పేజ్ హెడ్' అని పేరు పెట్టారు. కూతురు పుట్టిన ఏడాది తర్వాత, అంటే 15 ఏప్రిల్ 2023 న అడిలైడ్‌లోని చారిత్రాత్మక పబ్లిక్ మ్యూజియం 'క్యారిక్ హిల్' లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించాడు.
మోడలింగ్ వదిలేసి సక్సెస్‌ఫుల్ బిజినెస్‌వుమన్‌గా..
ట్రావిస్ హెడ్‌తో పెళ్లికి ముందు జెస్సికా మోడలింగ్ రంగంలో రాణించారు. ఆస్ట్రేలియాలోని పలు టాప్ మోడలింగ్ ఏజెన్సీలతో కలిసి పనిచేసిన ఆమె, తన గ్లామరస్ లుక్స్, అద్భుతమైన పర్సనాలిటీతో మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆమె పాత ఫోటోషూట్లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అయితే మోడలింగ్‌లో మంచి ఫేమ్ ఉన్నప్పటికీ జెస్సికా తన కెరీర్ రూట్ మార్చింది. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఒక విజయవంతమైన బిజినెస్‌వుమన్‌గా రాణిస్తున్నారు. సిడ్నీ, కాన్‌బెర్రా వంటి పెద్ద నగరాల్లో జెస్సికాకు సొంతంగా పలు పేరుగాంచిన రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఫుడ్ బిజినెస్‌లో బిజీగా ఉంటూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
గతంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో టీమిండియాపై ట్రావిస్ హెడ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసినప్పుడు కూడా కొందరు నెటిజన్లు జెస్సికాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఐపీఎల్ 2026 లో మరోసారి మైదానంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని, ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని సోషల్ మీడియాలో వేధించడం సరికాదని, క్రీడలను కేవలం క్రీడలుగానే చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications