Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs WI: హెడ్ గారూ.. ఇది టెస్టు.. కాస్త స్లోగా ఆడాలి! (Video)

ఇటీవల పాకిస్థాన్‌ను 3-0తో టెస్టుల్లో మట్టికరిపించిన ఆస్ట్రేలియా వెస్టిండీస్‌పై కూడా అదే జోరును ప్రదర్శిస్తోంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికే ఆసీస్ విజయాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. ఓటమి కోరల్లో నుంచి వెస్టిండీస్ తప్పించుకోవాలంటే అద్భుత పోరాటమే చేయాలి.

ఓవర్‌నైట్ స్కోరు 59/2తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసింది. మొదటి సెషన్ ఆరంభంలోనే గ్రీన్ (14) ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్ (119)తో కలిసి ఖవాజా (45) స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కానీ జస్టిన్ బౌలింగ్‌లో ఖవాజా షాట్‌కు యత్నించి అథంజె చేతికి చిక్కాడు. అనంతరం వెస్టిండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.

Travis Head batted aggressively in the Australia vs West Indies Test

దీంతో మరో ఎండ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ టీ20 మోడ్‌లోకి వెళ్లాడు. తొలుత నిదానంగా ఆడి 77 బంతుల్లో అర్ధ శతకం చేసిన హెడ్ తర్వాత చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించి 134 బంతుల్లో 119 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో హెడ్‌ను కొనియాడుతూ టెస్టు అంటే కాస్త జాగ్రత్తగా, నిదానంగా ఆడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, హెడ్ ఔటైన తర్వాత నాథన్ లయాన్ (24; 34 బంతుల్లో) ఆఖరి వికెట్‌కు విలువైన పరుగులు జోడించాడు.

వెస్టిండీస్ బౌలర్లలో షామర్ జోసెఫ్ అయిదు వికెట్లు పడగొట్టాడు. షామర్‌కు ఇదే తొలి టెస్టు కావడం విశేషం. అరంగేట్రంలోనే అయిదు వికెట్లతో సత్తాచాటాడు. రోచ్, జస్టిన్ చెరో రెండు వికెట్లు తీశారు.అయితే 95 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. హేజిల్‌వుడ్ ధాటికి (4/18) 19 పరుగులకే విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

జస్టిన్ (24)తో కలిసి మెకంజీ (26) జాగ్రత్తగా ఆడుతూ వికెట్లను కాపాడుకున్నాడు. కానీ మెకంజీని గ్రీన్ బోల్తాకొట్టించాడు. అయితే రెండో రోజు ఆట ఆఖరి ఓవర్‌లో కుదురుకున్న జస్టిన్‌ను నాథన్ లయాన్ ఔట్ చేసి వెస్టిండీస్‌కు పెద్దషాక్ ఇచ్చాడు. విండీస్ ఇంకా 22 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో జాషువా (17*) ఉన్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 188 పరుగులకే ఆలౌటైంది. మెకంజీ (50) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, హేజిల్‌వుడ్ చెరో నాలుగు వికెట్లు, స్టార్క్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.

Story first published: Thursday, January 18, 2024, 13:38 [IST]
Other articles published on Jan 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+