Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 Challenge: బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్‌ నోవాస్‌.. హర్మన్‌ప్రీత్ సేన‌కు చావోరేవో!!

Trailblazers vs Supernovas: Supernovas have won the toss and have opted to bat

షార్జా: మహిళల టీ20 ఛాలెంజ్‌ 2020లో భాగంగా మరో ఆసక్తికర సమరంకు సమయం ఆసన్నమైంది. లీగ్‌ చివరి మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సూపర్‌ నోవాస్‌ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో హర్మన్‌ప్రీత్‌ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు స్మృతి మంధాన తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

తొలి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని సూపర్‌ నోవాస్‌ టైటిల్‌ ఆశలు సజీవంగా నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. మరోవైపు వెలాసిటీని చిత్తుగా ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్‌ బ్లేజర్స్‌.. మరో విజయంతో గ్రాండ్‌గా ఫైనల్‌ చేరాలనుకుంటోంది. బ్లేజర్స్‌ ఓడినా మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో ఓటమి, గెలుపుతో ఉన్న వెలాసిటీ ముందంజ వేయాలంటే సూపర్‌నోవాస్‌ ఓడిపోవాల్సి ఉంటుంది.

బ్లేజర్స్‌ విజయంలో బౌలర్లు ఎకల్‌స్టోన్‌, జులన్‌ కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో వారి నుంచి మంధాన మరోసారి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. కాగా వెలాసిటీ చేతిలో ఎదురైన ఓటమి నుంచి కోలుకొని ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని సూపర్‌ నోవాస్‌ పట్టుదలతో ఉంది. ఫైనల్‌ రేస్‌లో వెలాసిటీని వెనక్కు నెట్టాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ కూడా కీలకం కానుండడంతో.. బ్యాట్స్‌వుమెన్‌ హర్మన్‌ప్రీత్‌, జెమీమా, చమరిపై బాధ్యత ఉంది.

తుది జట్లు:
ట్రయల్‌బ్లేజర్స్‌: డాటిన్‌, స్మృతి మంధాన (కెప్టెన్), రిచా, హర్లీన్‌, దీప్తి శర్మ, హేమలత, ఛాంతం, సాల్మా, సోఫియా, రాజేశ్వరి, గోస్వామి.

సూపర్‌నోవాస్‌: ప్రియ, ఛామరి, జెమిమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), శశికల, రాధ, అనుజ పాటిల్, షకీరా, తానియా, పూనమ్‌, అయబోంగా.

Story first published: Saturday, November 7, 2020, 19:38 [IST]
Other articles published on Nov 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+