For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విషాదం.. బంతి తాకి ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి

క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఆడాలనే తన కలను నిజం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న 17 ఏళ్ల యువ బ్యాటర్ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయాడు. మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా బంతి తగలడంతో ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ మృతి చెందాడు. దీంతో స్థానిక క్రీడా ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మంగళవారం మధ్యాహ్నం ఫర్న్‌ట్రీ గల్లీలోని వ్యాలవీ ట్యూ రిజర్వ్‌లో శిక్షణ తీసుకుంటుండగా ఈ విషాదకర సంఘటన జరిగింది. సమాచారం ప్రకారం.. ఈ యువకుడు నెట్స్‌లో హెల్మెట్ ధరించి బౌలింగ్ మెషీన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి అతని తల, మెడకు తగిలింది. తీవ్రంగా గాయపడిన బెన్ ఆస్టిన్‌ను మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బుధవారం ఆ యువ క్రికెటర్ తుదిశ్వాస విడిచాడు. ఫర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ గురువారం ఉదయం ఓ ప్రకటనలో ఈ యువ క్రికెటర్ మరణాన్ని ధ్రువీకరించింది.

Tragic Death of 17-Year-Old Australian Cricketer Ben Austin After Being Hit by Ball During Practice

క్లబ్ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. "బెన్ ఆస్టిన్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. బెన్ మరణ ప్రభావం మా క్రికెట్ కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరిపై ఉంటుంది. మా ప్రగాఢ సానుభూతి, ప్రార్థనలు అతని కుటుంబంతో ఉంటాయి." అని క్లబ్ సంతాపం తెలిపింది.

బెన్.. ఓ స్టార్ క్రికెటర్
బెన్‌ ఆస్టిన్‌ను అతని క్లబ్ ఒక స్టార్ క్రికెటర్, గొప్ప నాయకుడు, పోరాట యోధుడిగా అభివర్ణించింది. బెన్ ఆస్టిన్ ముల్‌గ్రేవ్, ఆల్డెన్ పార్క్ క్రికెట్ క్లబ్‌లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. వేవర్లీ పార్క్ హాక్స్ తరఫున జూనియర్ ఫుట్‌బాల్ ఆడాడు. ఫర్న్‌ట్రీ గల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నీ వాల్టర్స్, ఆస్టిన్‌ను 'ప్రతిభావంతుడు, అందరితో బాగా కలిసే వ్యక్తి' అని పేర్కొన్నారు. విక్టోరియన్ విద్యా మంత్రి బెన్ కారోల్ మాట్లాడుతూ.. ఈ విషాదం నుంచి అతని కుటుంబం కోలుకోవడానికి తాము అన్ని విధాలా సహాయం అందిస్తామని చెప్పారు.

ఆస్టిన్ మరణం 2014 నాటి విషాదంతో పోల్చబడుతోంది, ఆ సమయంలో ఆస్ట్రేలియా టెస్ట్ బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ ఆట సమయంలో మెడకు బంతి తగలడంతో మరణించాడు. హ్యూస్ మరణం తర్వాత క్రికెట్‌లో కంకషన్ లాంటి అనేక కొత్త నియమాలు వచ్చాయి.

Story first published: Thursday, October 30, 2025, 10:00 [IST]
Other articles published on Oct 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+