
నాలుగు వన్డేల్లో స్పిన్నర్ల హవా
రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో స్పిన్నర్ల హవానే కొనసాగింది. దీంతో రాంచీలో కూడా స్పిన్ ట్రాక్ రూపొందించారన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆస్ట్రేలియన్ మీడియా సైతం రాంచీ పిచ్ 'స్పిన్ పిచ్' అంటూ హడావుడి చేస్తోంది.
పిచ్‌పై నుంచి భారీగా పచ్చికను తొలగించారు
ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఆండ్రూ రామ్‌సే తన ట్విట్టర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. పిచ్‌పై నుంచి భారీగా పచ్చికను తొలగించారన్న ఉద్దేశంతో అతను ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. తొలిసారి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాంచీ మైదానంలో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్‌ను పరిశీలించారు.

ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ స్పందన
పిచ్‌ను పరిశీలించిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ మాట్లాడుతూ రాంచీ పిచ్‌ను పరిశీలించామని, మూడో టెస్టు విజయం కోసం ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు కోసం మొత్తం నాలుగు పిచ్‌లను సిద్ధం చేసినట్లు క్యూరేటర్ ఎస్బీ సింగ్ తెలిపారు.
మూడో టెస్టు కోసం నెంబరు ఐదో పిచ్ ఎంపిక
కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టు కోసం నెంబరు ఐదో పిచ్‌ను ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టుపై దృష్టి సారించాడు. బ్యాటింగ్ ప్రాక్టీసుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను మరోసారి టీమ్‌లోకి తీసుకోవాలని టీమిండియా భావిస్తున్నది.


Click it and Unblock the Notifications











