'ఆస్ట్రేలియా పరిస్థితులు భారత బౌలర్లకు కఠినంగా ఉంటాయి'


హైదరాబాద్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆసీస్ గడ్డపై పరిస్థితులు భారత బౌలర్లకు అనుకూలంగా ఉండవని పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అన్నాడు. ఉపఖండం బౌలర్లు అక్కడ సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసిరేందుకు ఇబ్బందులు పడతారని పేర్కొన్నాడు.

వసీం అక్రమ్ మాట్లాడుతూ
తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో వసీం అక్రమ్ మాట్లాడుతూ "భారత బౌలర్లకు ఆస్ట్రేలియాలో పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు. అడిలైడ్, మెల్‌బోర్న్‌లో డ్రాప్ ఇన్ పిచ్‌లు ఉన్నాయి. అవి ఎంత మాత్రం బౌన్సీ పిచ్‌లు కావు. బ్రిస్బేన్‌లో కాస్త బౌన్స్ ఉండొచ్చు. పెర్త్‌లో కొత్త మైదానం అనుకుంటున్నా" అని వసీం అక్రమ్ అన్నాడు.

కూకాబుర్ర బంతులు స్వింగ్ అవ్వవు
"అయితే, పెర్త మైదానం ఏ తరహా వికెట్ అనేది తెలియదు. మెరుపు పోయిన తర్వాత కూకాబుర్ర బంతులు స్వింగ్ అవ్వవు. అందుకే పాక్, భారత బౌలర్లు అక్కడ ఇబ్బందులు పడతారు. ఏ లెంగ్త్‌లో బంతులు వేయాలో అర్థం కాదు. 20-25 ఓవర్లకు కూకాబుర్ర పాతబడగానే ఆసీస్ ఆటగాళ్లు అందిపుచ్చుకుంటారు" అని అక్రమ్ పేర్కొన్నాడు.

డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ విజయం సాధించగా, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా రెండో టీ20 రద్దైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications