Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ నీకు ఏ విధంగా సాయపడగలను: 'ఏక్ ఆశా'పై షారుక్

హైదరాబాద్: సామాజిక అంశాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటాడు. తనకి ఇంత ఇచ్చిన అభిమానులకు ఏదో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో 'గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌'ను కూడా నిర్వహిస్తున్నాడు.

తాజాగా గౌతం గంభీర్‌ ఈ ఫౌండేషన్‌ ద్వారా నిరుపేదల ఆకలిని తీర్చేందుకు దేశ రాజధాని ఢిల్లీలో మొదటి కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని పటేల్‌ నగర్‌లో 'ఏక్ ఆశా' అనే పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌ను గంభీర్‌ ప్రారంభించాడు.

ఏ ఒక్కరూ ఆకలితో బాధపడుతూ.. ఖాళీ కడుపుతో నిద్రించకూడదని భావించిన గౌతీ ఈ క్యాంటిన్‌ ద్వారా ఎంతో మంది ఆకలిని తీర్చుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను గంభీర్ ఎప్పటికప్పుడు తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.


నిరుపేదల కోసం గంభీర్ ఏర్పాటు చేసిన ఈ కమ్యూనిటీ కిచెన్‌‌పై బాలీవుడ్‌ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు యజమాని షారుక్‌ ఖాన్‌ స్పందించాడు. గంభీర్ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం షారుక్ ఖాన్‌కి తెగ నచ్చడంతో 'నువ్వు చేపట్టిన ఈ కార్యక్రమానికి నేను ఏ విధంగా సాయపడగలనో చెప్పు మై కెప్టెన్‌' అని షారుక్‌ ట్విటర్‌ ద్వారా గంభీర్‌ను అడిగాడు.

అయితే 'ఏ ఒక్కరూ ఆకలితో బాధపడుతూ, ఖాళీ కడుపుతో నిద్రపోకూడదు' అన్నది ఈ కిచెన్‌ ముఖ్య ఉద్దేశమని గంభీర్‌ అన్నాడు. ఏడాదిలో 365 రోజుల పాటు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3గంటల వరకు ఉచితంగా భోజనం అందజేస్తామని గంభీర్ తెలిపాడు.

'ప్రపంచ కప్‌లు గెలిచాను, ఐపీఎల్‌ను గెలిచాను. ప్రత్యర్థులపై పైచేయి సాధించాను. ఇప్పుడు ఆకలిపై పోరాడి ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు సమయం వచ్చింది' అని గంభీర్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు. గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు రెండు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+