
చివరి రోజు రెండో ఇన్నింగ్స్
అంతకుముందు 2 వికెట్ల నష్టానికి 87 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే డకెట్ (0) వికెట్‌ను కోల్పోగా, అతని స్థానంలో వచ్చిన మొరుూన్ అలీ (2)ని రవీంద్ర జడేజా, బెన్‌స్టోక్స్ (6)ను జయంత్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చగా, నైట్ వాచ్‌మన్ జో రూట్ (25) మహమ్మద్ షమీ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు.

లంచ్ విరామ సమయానికి 142/7
ఈ తరుణంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో స్థిమితంగా ఆడుతూ భారత బౌలర్లను ప్రతిఘటించినప్పటికీ ఆదిల్ రషీద్ (4) షమీ బౌలింగ్‌లో వికెట్ల వెనుక వృద్ధిమాన్ సాహాకు దొరికిపోయాడు. దీంతో మధ్యాహ్న భోజన విరామా సమయానికి 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత కూడా భారత బౌలర్లను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది.

158 పరుగులకే ఆలౌట్
భోజన విరామ సమయం ముగిసిన తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో అన్సారీ (0), జయంత్ యాదవ్ బౌలింగ్‌లో స్టూవర్ట్ బ్రాడ్ (5), జేమ్స్ ఆండర్సన్ (0) పెవిలియన్‌కు పరుగెత్తగా, బెయిర్ స్టో (34) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అశ్విన్
ఈ మ్యాచ్‌లో 119 పరుగులిచ్చి మొత్తం 9 వికెట్లు సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ఈ ఏడాది అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 55 వికెట్లు కైవసం చేసుకుని శ్రీలంక బౌలర్ రంగన హెరత్ (54 వికెట్లు)ను అధిగమించిన అశ్విన్ కెరీర్‌లో ఇప్పటివరకూ 41 టెస్టు మ్యాచ్‌లలో మొత్తం 231 వికెట్లు రాబట్టాడు.

ఇంగ్లాండ్‌పై భారత జట్టు సాధించిన అతిపెద్ద రెండో విజయం
టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో మరో 81 పరుగులు సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్నాడు.

కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ విశాఖపట్నం నాకు అచ్చొచ్చిన గ్రౌండ్ అని అన్నాడు. అడిలైడ్ మాదిరిగా ఈ మైదానం కూడా నాకు అచ్చొచ్చింది. పిచ్ సహకారం పక్కనపెడితే మా బ్యాట్స్‌మెన, బౌలర్లు బాగా రాణించారని తెలిపాడు. రెండో టెస్టులో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడం కలిసొచ్చిందని పేర్కొన్నాడు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచామని, తొలి టెస్టు అయినా జయంత్ బాగా ఆడాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు చక్కటి పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసించాడు.

రెండో టెస్టులో టాస్ కీలక పాత్ర
ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో భారతకు మేం పోటీ ఇచ్చామని తెలిపాడు. గెలవకపోయినా మ్యాచ్ డ్రా చేద్దామనుకున్నామని, కానీ ఫలితం నిరాశపర్చిందన్నాడు. అయితే మ్యాచ్‌ను అంత తేలిగ్గా వదిలిపెట్టలేదన్నాడు. మ్యాచ్‌లో విరాట్ చేసిన పరుగులు పక్కనబెడితే మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను మేం ఒత్తిడికి గురిచేశామన్నాడు. అయితే టాస్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. రెండోరోజు మా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందని, సిరీస్‌లో నిలబడాలంటే రానున్న టెస్టుల్లో మరింత బాగా రాణించాలని తెలిపాడు.

వైజాగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ఇకపై భారతలో టెస్ట్ మ్యాచ్ అంటే వైజాగ్ గుర్తుకొస్తుందని భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. టెస్టు నిర్వహణకు సరైన వేదికల్లో ఏసీఏ-వీడీసీఏ ఒకటిగా నిలిచిందన్నాడు. తొలిసారిగా నిర్వహించిన టెస్టులో ఫలితం రావడమే కాకుండా భారత్ నెగ్గడం తీపి గుర్తుగా మిగిలిపోతుందన్నాడు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై అనేక అపోహలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అవన్నీ తలకిందులయ్యాయి. కామెంటేటర్లు కూడా వికెట్‌పై సంతృప్తి వ్యక్తం చేశారని అన్నాడు. విశాఖ స్టేడియానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు వచ్చిందని, ఇది తెలుగు వారందరికీ గర్వకారణమని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications