Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka 3rd T20I లో న‌మోదైన టాప్ రికార్డులు ఇవే! తోపు ఎవ‌రంటే..

Top records recorded in India vs Sri Lanka 3rd T20I Match

ధ‌ర్మ‌శాల‌: ఆదివారం ముగిసిన భార‌త్, శ్రీ‌లంక మూడో టీ20 మ్యాచ్‌లో అనేక రికార్డులు న‌మెద‌య్యాయి. ఈ మ్యాచ్‌తో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు (125) ఆడిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ (124 మ్యాచ్‌లు) రికార్డును బ్రేక్ చేశాడు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డులు

శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డులు

భార‌త్, శ్రీ‌లంక టీ20 సిరీస్‌లోని 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచ‌రీలు సాధించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ ఒక్క సారి కూడా ఔట్ కాలేదు. ఈ క్ర‌మంలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్య‌ధికంగా 204 ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా అయ్య‌ర్ నిలిచాడు. ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లీ 199 ప‌రుగుల రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే టీ20ల్లో శ్రీ‌లంక‌పై వ‌రుస‌గా 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచ‌రీలు చేసిన చేసిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. గ‌తంలో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌ర్వాత శ్రీ‌లంక‌పై వ‌రుస‌గా 3 మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచ‌రీలు సాధించిన ఆట‌గాడిగా అయ్య‌ర్ నిలిచాడు. ఇక త‌న టీ20 కెరీర్లో అయ్య‌ర్ అత్య‌త్త‌మ మొద‌టి, రెండో స్కోర్ల‌ను ఈ సిరీస్‌లో న‌మోదు చేశాడు.

టీమిండియా రికార్డులు

టీమిండియా రికార్డులు

టీ20 ఫార్మాట్‌లో భార‌త్ వ‌రుస‌గా 12వ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో ఆఫ్ఘనిస్తాన్, రొమేనియాతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. భారత జ‌ట్టు స్వదేశంలో శ్రీలంకపై వరుసగా పది టీ20 మ్యాచ్‌ల‌ను గెలుచుకుంది. చివ‌రగా 2016లో స్వ‌దేశంలో శ్రీ‌లంక చేతిలో టీమిండియా ఓడిపోయింది. అలాగే టీ20 ఫార్మాట్‌లో టీమిండియా వ‌రుస‌గా 3 సిరీస్‌ల‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ప‌వ‌ర్‌ప్లేలో శ్రీ‌లంక అత్య‌ల్పంగా 18-3 స్కోర్‌ను న‌మోదు చేసింది.

రోహిత్ చెత్త రికార్డులు

రోహిత్ చెత్త రికార్డులు

టీ20ల్లో శ్రీ‌లంక బౌల‌ర్ చ‌మీర.. రోహిత్ శ‌ర్మ‌ను అత్య‌ధికంగా 6 సార్లు ఔట్ చేశాడు. చ‌మీర త‌ర్వాత న్యూజిలాండ్ పేస‌ర్ టీమ్ సౌథీ రోహిత్‌ను 4 సార్లు ఔట్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శ‌ర్మ 45 సార్లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో కెవిన్ ఓబ్రియన్ (44) చెత్త రికార్డును హిట్‌మ్యాన్ అధిగ‌మించాడు. ఇందులో ఓపెప‌నర్‌గా 29 సార్లు సింగిల్ డిజిట్‌కు పరిమిత‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో ఐర్లాండ్ ఓపెన‌ర్ పాల్ స్టిర్లింగ్ (28)ను రోహిత్ శ‌ర్మ అధిగ‌మించాడు.

మ‌రిన్ని రికార్డులు

మ‌రిన్ని రికార్డులు

శ్రీ‌లంక ఓపెన‌ర్ దనుష్క గుణతిలక భార‌త్‌తో 9 టీ20 మ్యాచ్‌లు ఆడి 12.11 స‌గ‌టుతో 109 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే భార‌త్‌తో టీ20 మ్యాచ్‌ల్లో అత్య‌ధికంగా 4 సార్లు గోల్డెన్ డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా గుణ‌తిల‌క నిలిచాడు. శ్రీ‌లంక ఓపెన‌ర్లు అత్య‌ల్పంగా 9.09 స్ట్రైక్‌రేట్‌ను న‌మోదు చేశారు.

Story first published: Monday, February 28, 2022, 10:04 [IST]
Other articles published on Feb 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+