కోహ్లీ టాప్ ర్యాంకుకి ఎసరుపెట్టనున్న విలియమ్సన్

న్యూఢిల్లీ: కోహ్లీ టెస్టు నెంబర్ వన్ ర్యాంకుకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్ నుంచి.. టెస్టుల్లో టాప్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఎంతోకాలంగా కోహ్లీకి పోటీనిచ్చిన స్మిత్ లేకపోవడంతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానానికి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

920తో కోహ్లీ.. 913 వద్ద విలియమ్సన్
విలియమ్సన్ ఇటీవల 900 పాయింట్ల మార్క్‌ను దాటిన తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ (920 పాయింట్లు) టాప్‌లో ఉండగా.. ఏడు పాయింట్ల తేడాతో విలియమ్సన్ (913) తర్వాతి స్థానంలో ఉన్నాడు. అడిలైడ్ టెస్టులో ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ.. 15 పాయింట్లు కోల్పోయి 920కి పడిపోయాడు. ఇలా కోహ్లీ 920 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్) 913, స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 901 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

తొలి టెస్టు మ్యాచ్ పూజారాకు మంచి ఫలితాన్ని
భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాకు ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్ చక్కని ఫలితాన్నే ఇచ్చింది. తాను కోల్పోయిన టాప్-10లో తిరిగి చోటు దక్కింకున్నాడు. 846 పాయింట్లు సంపాదించిన అతనికి నాలుగో స్థానం లభించింది. జో రూట్ 807 పాయింట్లతో ఐదో స్థానాన్ని అధిరోహించాడు.

అశ్విన్ స్థానం పదిలం
బౌలింగ్ విభాగానికి వస్తే, రవిచంద్రన్ అశ్విన్ ‘టాప్-5'లో చోటును పదిలం చేసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 33వ స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో కాగిసో రబదా (దక్షిణాఫ్రికా) 882 పాయింట్లు, జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) 874 పాయింట్లు, వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) 826 పాయింట్లు వరుసగా మొదటి 3 స్థానాలను సంపాదించారు.

‘టాప్-5'లో రవీంద్ర జడేజా ఒక్కడికే
పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ (821)కు నాలుగో స్థానం దక్కగా, అశ్విన్‌కు ఐదో స్థానం లభించింది. బుమ్రా 392 పాయింట్లతో 33వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే, ‘టాప్-5'లో రవీంద్ర జడేజా ఒక్కడికే భారత్ నుంచి చోటు దక్కింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications