
రెస్టారెంట్ వ్యాపారంలోకి
దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ దారిలోనే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రెస్టారెంట్ వ్యాపారంలోకి వచ్చాడు. గతేడాది ఢిల్లీలోని ఆర్కే పురంలో న్యుయేవా పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇందులో యురోపియన్, దక్షిణ అమెరికన్, పెరువియాన్ డిష్ ప్రత్యేకం. ఐపీఎల్ 2018 సీజన్ సందర్భంగా బెంగళూరు ఆటగాళ్లు ఈ రెస్టారెంట్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ కాన్వో బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ
స్పోర్ట్ కాన్వోకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టార్టప్‌లో కోహ్లీ భాగస్వామిగా పెట్టుబడులు పెట్టాడు. ఈ స్పోర్ట్స్ కాన్వో నుంచి విరాట్ కోహ్లీ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నాడు. స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ఈ కంపెనీకి ఓ యాప్ కూడా ఉంది.

దుస్తుల వ్యాపారంలో కోహ్లీ ప్రవేశం
ఫ్యాషన్ రంగంలో కూడా విరాట్ కోహ్లీకి ప్రవేశించాడు. రాగన్ (WROGN) పేరుతో కోహ్లీకి ఓ బ్రాండ్ ఉంది. 2014లోనే కోహ్లీ ఈ వ్యాపారంలోకి వచ్చాడు. తొలుత ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ మింత్రాతో మొదలుపెట్టిన కోహ్లీ.. ఆ తర్వాత షాపర్‌స్టాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 ఆఫ్‌లైన్ స్టోర్‌లో కోహ్లీ బ్రాండ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి.

జిమ్ వ్యాపారంలోకి కోహ్లీ
సాధారణంగా క్రికెటర్ అంటే ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. దీంతో విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌తో పాటు అభిమానుల ఫిట్ నెస్‌పై కూడా దృష్టిపెట్టాడు. ఇందులో భాగంగా 2015లో చిసెల్ జిమ్ అండ్ ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించాడు. ఇందులో విరాట్ కోహ్లీ రూ.90 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాడు.

టెన్నిస్, రెజ్లింగ్ రంగాల్లో కూడా
కెప్టెన్ కోహ్లీకి ఆదాయం వచ్చే వ్యాపారాల్లో ముఖ్యమైనవి యూఏఈ రాయల్స్, బెంగళూరు యోధాస్. దుబాయికి చెందిన యూఏఈ రాయల్స్ అనే టెన్నిస్ జట్టులో 2015లో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఈ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. రెజ్లింగ్ జట్టు బెంగళూరు యోధాస్ లోనూ కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సైతం
కోహ్లీకి క్రికెటేతర ఆదాయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేది ఇండియన్ సూపర్‌లీగ్‌లో ఎఫ్‌సీ గోవా జట్టు ద్వారానే. ఈ ఫుట్‌బాల్ జట్టులో కోహ్లీ 2014లో కో ఓనర్‌గా చేరాడు. ఎఫ్‌సీ గోవా జట్టులో కోహ్లీకి 25 శాతం వాటా ఉందని సమాచారం. దీనిపై ప్రతి ఏటా విరాట్ కోహ్లీ రూ. కోటికి పైగా ఆర్జిస్తున్నాడని జాతీయ మీడియాలో కథనం.


Click it and Unblock the Notifications
