కేజీఎఫ్ డైలాగ్‌కు ముడిపెడుతూ..
ఇక ఈ మధ్య ఫేమస్ అయిన డైలాగ్ ఏదైనా ఉందంటే అది కేజీఎఫ్ ఛాప్టర్ 2లోని వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్ డైలాగే. దీన్ని కోహ్లీకి ముడిపెడుతూ.. ట్రోఫీ, ట్రోఫీ, ట్రోఫీ.. ఐ లైక్ ట్రోఫీ.. బట్ ట్రోఫీ డస్ నాట్ లైక్ మీ. అంటూ ఓ మీమర్ మీమ్ చేశాడు. 15ఏళ్లుగా ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ దక్కలేదు. ట్రోఫీ కోసం ప్రతి ఏడాది ఎంతో ఉత్తేజంతో ఆర్సీబీ బరిలోకి దిగుతుంటుంది. కానీ చివర్లో బొక్కబోర్లపడుతుంది. దీన్ని ఉద్దేశించి మీమర్ ఈ మీమ్ క్రియేట్ చేశాడు.
మిగతా జట్ల ఫ్యాన్స్ హేళన చేసేలా
ఇక ఆర్సీబీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతకు తగ్గట్లు హేటర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా మిగతా జట్లను ఆరాధించేవారు ఆర్సీబీని మరీ మరీ ఏకిపారేస్తుంటారు. ఒక్క ట్రోఫీ కూడా కొట్టలేకపోయిందంటూ విమర్శలతో హోరెత్తిస్తుంటారు. ఇక మీమర్ ఈ విషయంలో తన క్రియేటివిటినీ చూపించాడు. సీఎస్కే, ముంబై జట్ల ఫ్యాన్స్ ఏ విధంగా ఆర్సీబీని హేళన చేస్తుంటారో.. ఓ మూవీ క్లిప్ తీసుకుని చూపించారు. అందులో ముంబై, సీఎస్కేకు ముడిపెట్టిన పాత్రధారులు తొలుత చాలా డల్‌గా కన్పిస్తుంటారు.. ఇక బీరు తాగే క్రమంలో ఈసాలా కప్ నమ్ దే అంటూ ఓ యాక్టర్ అనగా ఇద్దరు కలిసి తెగ నవ్వేస్తుంటారు.

సర్కారు వారి పాట డైలాగ్ ఉపయోగించి..
ఇటీవల తెలుగులో రిలీజైన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీలోని ఓ డైలాగ్ చాలా ఫన్ వేలోనే సీరియస్ వార్నింగ్ లాగా ఉంటుంది. ఇక ఈ డైలాగ్‌ను మహేష్ బాబు ఆర్సీబీ జట్టుకు చెపుతున్నట్లు ఓ మీమర్ మీమ్ క్రియేట్ చేసి తన క్రియేటివిటీ చూపించాడు. ఇక ఈ మీమ్ లో మహేష్ బాబు రాజస్థాన్ రాయల్స్ జట్టుగా కన్పించగా.. విలన్ ఆర్సీబీ జట్టులా పోల్చాడు. ఇక మహేష్ బాబు డైలాగ్ కొడుతూ.. ఆ ఎక్కడికి వెళ్లిపోతారు..ఆ వీళ్లు ఫైనల్ వెళ్లిపోతారటా.. అంటూ మీమ్ చేయగా అది చాలా ఫన్ వేలో ఆకట్టుకుంది.
దీన్ని ఎవరూ మార్చలేరు
ఇక ఆర్సీబీ ప్రతిసారి ఈ సాల కప్ నమ్ దే అంటూ ఐపీఎల్లో బరిలోకి దిగడంతో.. ఇలా అనుకుని బతికేయండి ఇక అంటూ ఓ తెలుగు మీమర్ ఓ జిఫ్ ఫైల్ పెట్టి ట్వీట్ చేశాడు. ఈ ఆర్సీబీని ఎవరూ మార్చలేరు అని పేర్కొన్నాడు. అప్పట్లో డివిలియర్స్ ఉన్నా.. ఇప్పుడు మ్యాక్స్ వెల్, రజత్ పటీదార్, డుప్లెసిస్ లాంటి హిట్టర్లున్నా.. ఆర్సీబీ మారదు, మారబోదు అని తెలిపాడు.
పాపం ఆంటీకి అయినా న్యాయం చేయండి
ఇక ఆర్సీబీ గెలుస్తుందని గంపెడాశలతో అభిమానులు స్టేడియాలలో రకరకాల ప్లకార్డులు ప్రదర్శిస్తుంటారు. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ లో ఓ ఆంటీ.. ఆర్సీబీ గెలిచేదాకా నేనసలు పెళ్లే చేసుకోను అని రాసిన ట్యాగ్ లైన్ ప్రదర్శించింది. ఇక ఆర్సీబీ ఓడిపోవడంతో పాపం ఆ ఆంటీకి పెళ్లయే భాగ్యం లేదనుకుంటా అంటూ మీమర్స్ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. ఇక కొందరు కనీసం ఆ ఆంటీకైనా న్యాయం చేయండంటూ ఆర్సీబీ ప్లేయర్లను బతిమాలుతూ ట్వీట్ చేశారు. ఇంకొందరు మాత్రం ఏకంగా ఆమె పెళ్లయ్యే సరికి.. అస్తిపంజరంలా మారిపోతుందని చూపించేలా మరో పోస్టు చేశారు. నెట్టింటా ఈ పోస్టు వీపరీతంగా వైరలైంది.


Click it and Unblock the Notifications












