Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan : ప్లేయర్ల మధ్య టాప్-5 టఫ్ సమరాలు ఇవే..! కోహ్లీ వర్సెస్ ? రోహిత్ వర్సెస్ ? భువీ వర్సెస్ ?

Top 5 Tough Battles of Players During India vs Pakistan

దుబాయ్: ఆసియాకప్ మెగా టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ సాయంత్రమే దుబాయ్ స్టేడియంలో 7:30గంటలకు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ సేన - బాబర్ ఆజామ్ సేన బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ టైంలో భారత ప్లేయర్లు, పాకిస్థాన్ ప్లేయర్ల మధ్య టఫ్ పోరు జరగనుంది. ముఖ్యంగా కొందరు ప్లేయర్ల మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉంటుంది. అందులో టాప్ 5 బ్యాటిల్స్ ఓసారి గమనిస్తే..

విరాట్ కోహ్లీ vs షాదాబ్ ఖాన్

విరాట్ కోహ్లీ vs షాదాబ్ ఖాన్

విరాట్ కోహ్లీపై స్పెషల్ ఫోకస్ నెలకొంది. ఫామ్‌ విషయంలో సతమతమవుతున్న విరాట్.. విరామం తర్వాత పుంజుకుంటాడో లేదో చూడాలి. లెగ్ స్పిన్‌ విషయంలో కోహ్లీ ఎదుర్కొనే అసౌకర్యం పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్‌కు కాస్త అడ్వంటేజీ ఉండొచ్చు. వైట్-బాల్ ఫార్మాట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌లలో ఒకడిగా పేరొందిన షాదాబ్ ఖాన్, కోహ్లీ మధ్య టఫ్ బ్యాటిల్ చూసే వీలుంది. కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటే ఎంతటి వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా అతని ముందు ఉఫే. వీరిద్దరి బ్యాటిల్లో ఎవరిదో పైచేయి మరీ.

రోహిత్ శర్మ vs హరీస్ రవూఫ్

రోహిత్ శర్మ vs హరీస్ రవూఫ్

భారత కెప్టెన్ రోహిత్‌ శర్మను ఎదుర్కొనే బాధ్యత పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ మీద పడింది. షాహీన్ అఫ్రిది లేకపోవడంతో రవూఫ్ ఆ జట్టు పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఆరంభంలో రోహిత్‌ను అతను ఎదుర్కోనున్నాడు. కీలక మ్యాచ్‌లలో రోహిత్ నిరాశపర్చుతాడనే అపవాదును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ అపవాదును తొలగించుకోవడానికి రోహిత్‌‌కు ఇదో మంచి తరుణం. గత సంవత్సరం టీ20 ప్రపంచ‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గోల్డెన్ డక్‌ అయ్యాడు. ఈసారి రోహిత్ ఏం చేస్తాడో చూడాలి. హరీస్ రవూఫ్‌ను సమర్థంగా ఎదుర్కొని కాసేపు నిలబడితే హిట్ మ్యాన్‌ను అడ్డుకునేవాడే ఉండడు.

అర్ష్‌దీప్ సింగ్ vs మహ్మద్ రిజ్వాన్

అర్ష్‌దీప్ సింగ్ vs మహ్మద్ రిజ్వాన్

కేవలం 6 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అర్ష్‌దీప్ సింగ్‌ ప్రతిభావంతుడనే విషయంలో కించిత్ సందేహం లేదు. తొలినాళ్లలోనే పాకిస్థాన్‌తో కీలక ఈవెంట్ మ్యాచ్‌ను అతను ఎదుర్కోబోతున్నాడు. ఇది కొంచెం అతనికి సవాల్ విషయమే. ఆరంభ స్పెల్ వేసే అర్ష్ దీప్ సింగ్.. మహమ్మద్ రిజ్వాన్ లాంటి నిఖార్సైన ఓపెనర్‌ను ఎదుర్కోవాలి. రిజ్వాన్ చాలా మంచి ఫాంలో ఉన్నాడు. అందువల్ల అతన్ని ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. అయితే అర్షదీప్ సింగ్ కచ్చితమైన యార్కర్లు అతన్ని బురిడీ కొట్టించే వీలున్నాయి.

యుజ్వేంద్ర చాహల్ vs ఆసిఫ్ అలీ

యుజ్వేంద్ర చాహల్ vs ఆసిఫ్ అలీ

రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'ఇది ఎప్పుడూ పెద్ద మ్యాచే. భారీ హైప్ ఉంది. కానీ ఒక ఆటగాడిగా.. నేను 100శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ మ్యాచ్ పరంగా మాపై ఒత్తిడి, అంచనాలు భారీగా ఉన్నాయి.' అన్నాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ గురించి వస్తున్న హైప్ అంతా బయటే ఉంది. మేం దాని గురించి అర్థం చేసుకున్నాం. చాలా మంది వ్యక్తులు ఈ గేమ్‌తో సైకాలజికల్‌గా అటాచ్ అయ్యారు. కానీ మేం మ్యాచ్ కోసం బయట ఉన్న హైప్‌ను బయటే ఉంచేలా చూసుకోవాలి. మాకు మ్యాచ్ పరంగా అవసరమైన వాటిపైనే మేం దృష్టి పెట్టాలి.' అని చెప్పాడు.

భువనేశ్వర్ కుమార్ vs బాబర్ ఆజం

భువనేశ్వర్ కుమార్ vs బాబర్ ఆజం

భారత పేస్ దళ నాయకుడు భువీకి, పాక్ నాయకుడు బాబర్ ఆజామ్‌కు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఓపెనింగ్ స్పెల్‌లో భువీ ఓపెనర్‌గా బరిలోకి దిగే బాబర్ ఆజామ్‌ మధ్య ఫైట్ మామూలుగా ఉండదు.. ఇరువైపులా చురకత్తుల్లాంటి స్వింగ్ బంతులు వేసే భువీని బాబర్ బరాబర్ ఎదుర్కోగలడా.. లేక బోల్తా పడతాడో చూడాలి. ప్రస్తుతం భువీ కొత్త బంతితో నిప్పులు చెరిగే బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్, విండీస్ పర్యటనలో భువీ ఖలేజా ఏంటో చూశాం. అయితే బాబర్‌ను ప్రస్తుతం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా పేర్కొంటుండడంతో అతను ఎలాంటి స్కిల్స్ వాడి భువీని ఎదుర్కొంటాడో చూసి తీరాల్సిందే.

Story first published: Sunday, August 28, 2022, 17:31 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+