టీ20 ప్రపంచకప్ ముందు చెత్త ఫామ్‌తో కలవరపెడుతున్న టీమిండియా ఐదుగురు స్టార్లు

ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో చాలా ఉత్కంఠరేపే మ్యాచ్‌లు ఇప్పటి‌దాకా చూశాం. ఈ ఐపీఎల్లో కొందరు కొత్త ప్లేయర్లు తమ అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చారు. ఎలాగైనా ఐపీఎల్లో రాణించి టీమిండియా తలుపు తట్టాలని కొందరు యువ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఇక కొందరు టీమిండియాలో ఇప్పటికే స్థిరపడి స్టార్ ప్లేయర్లుగా వెలుగొందుతున్న ప్లేయర్లు మాత్రం పేలవ ఫామ్ కనబరుస్తున్నారు. వారి ఫామ్ వారి అభిమానులతో పాటు క్రికెట్ వర్గాలకు సైతం ఆందోళన కలిగిస్తుంది.

టీ20 ప్రపంచ కప్ ముందున్న తరుణంలో ఐపీఎల్లో వారు రాణించకపోవడం కలవరానికి గురి చేస్తోంది. మరో వైపు అంతర్జాతీయ జట్లు అన్ని విధాలుగా టీ20కి సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా స్టార్లు ఇలాంటి ఫామ్ కనబర్చడం భారత కోచ్ రాహుల్ ద్రావిడ్, కోచ్ సహాయక సిబ్బందికి ఆందోళన రేకెత్తిస్తోంది. కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లయితే పర్లేదు కానీ.. భారత జట్టులో స్థిర ప్లేయర్లుగా కొనసాగుతున్న ఐదుగురు అంతంతమాత్రంగా ప్రదర్శన చేస్తూ తమ ఆటతీరు పట్ల సందేహాలు రేకెత్తిస్తున్నారు.

శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్

2017నుండి టీమిండియా జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా శార్దూల్ కొనసాగుతున్నాడు. గబ్బా టెస్ట్‌లో చారిత్రాత్మక విజయంలో శార్దూల్ బ్యాటింగ్, బౌలింగ్‌‌తో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లలో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 సీజన్లో మాత్రం శార్దూల్‌ తన మార్క్ చూపించలేకపోతున్నాడు. 12 మ్యాచ్‌లలో మ్యాచ్‌కు 45పరుగుల సగటుతో కేవలం 9వికెట్లతో బౌలింగ్ చేశాడు. శార్దూల్ ఎకానమీ రేటు 9.8గా ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది.

రిషబ్ పంత్

రిషబ్ పంత్

24సంవత్సరాల వయస్సులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపిస్తున్న రిషబ్ పంత్... భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే పంత్ మూడు ఫార్మాట్‌లలో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. తన కెప్టెన్సీలో ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన రిషబ్ పంత్ టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2022లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా పంత్ నమోదు చేయలేదు. కెప్టెన్‌గా బాధ్యతారాహిత్యంగా కొన్ని సార్లు ఔటయినట్లు కన్పించాడు. అయినప్పటికీ 156.38 స్ట్రైక్ రేట్‌తో 32.67సగటుతో 300పరుగులకు చేరువగా స్కోర్ చేసిన పంత్ తన అసలు సిసలు ఫామ్‌లో మాత్రం లేడు.

రవీంద్రా జడేజా

రవీంద్రా జడేజా

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ దఫా కెప్టెన్‌గా తొలి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రవీంద్రా జడేజా ప్రస్తుతం కోల్డ్ స్పాట్‌లో ఉన్నాడు. రూ.16కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి సీఎస్కే జడేజాను కొనుక్కుంది. అతనికి కెప్టెన్సీ అప్పగించింది. కానీ వరుస పరాజయాల దెబ్బకు అతను కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆడిన 10మ్యాచ్‌లలో 19.33 సగటుతో 118.37స్ట్రైక్ రేట్‌తో కేవలం 116పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 10 మ్యాచ్‌లలో 7.52 ఎకానమీతో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. టీ20ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో రవీంద్రా జడేజా లాంటి ఆల్రౌండర్ అత్యంత కీలకం. కానీ ప్రస్తుతం రవీంద్రా జడేజా ఫామ్ టీమిండియా వర్గాలను కలవరపెడుతోంది.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2022 సీజన్ విరాట్ కోహ్లీకి పీడకల లాంటిది. ఫామ్‌లో లేకపోవడం అంటే ఏమిటో ఇప్పుడు తనకు అర్థమైందని కోహ్లీ స్వయంగా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022లో 12 గేమ్‌లలో ఈ ఆర్సీబీ మాజీ కెప్టెన్ 111.34 స్ట్రైక్ రేట్‌తో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు కెప్టెన్సీని వదులుకున్న కోహ్లీ ఇక ప్లేయర్‌గా చెలరేగుతాడనుకుంటే జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ కోహ్లీ తన సాధారణ ఫామ్‌లోకి తిరిగి రావాలని సగటు టీమిండియా అభిమాని కోరుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్ గెలవాలంటే కోహ్లీ లాంటి నిఖార్సైన ప్లేయర్ భారత జట్టుకు అవసరం.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

భారత జట్టు తదుపరి కెప్టెన్‌ అయ్యాక రోహిత్ శర్మ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఓటమి రుచి ఎరగలేదు. కానీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తున్న రోహిత్‌కు మాత్రం ఈ సీజన్లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలుపు దక్కలేదు. రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ముంబై కెప్టెన్‌గా 5 టైటిళ్లు అందించాడు. కెప్టెన్ గా రాణించే రోహిత్.. ఈసారి కెప్టెన్‌గా తన జట్టును అట్టడుగున నిలపడం తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ సీజన్లో 11మ్యాచ్‌లలో 125 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు మాత్రమే రోహిత్ చేశాడు. ప్లేయర్ గానూ రోహిత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రానున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ కెప్టెన్సీ, ఆట రెండు గాడిన పడాలి. లేదంటే టీమిండియాకు చెప్పరాని నష్టం తథ్యం.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 13, 2022, 9:04 [IST]
Other articles published on May 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X