Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS SA : రెండో వన్డేలో భారత్ గెలవడానికి టాప్ 5 కారణాలివే..!

Top 5 Reasons For India Victory Against Southafrica In 2nd ODI

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికాను ఓడించిన ఇండియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 278పరుగులు చేయగా.. 279పరుగుల లక్ష్యాన్ని మరో 25బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది.

సిరీస్లో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా సత్తా చాటింది. ఈ గెలుపుతో మంచి ఆత్మవిశ్వాసాన్ని అందుకుని ఢిల్లీలో జరగబోయే డిసైడర్ అయిన చివరి వన్డేకు భారత్ సిద్ధం కానుంది. ఇక ఈ మ్యాచ్ భారత్ గెలవడానికి టాప్ 5 కారణాలను ఓ సారి విశ్లేషిస్తే..

1. టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం

1. టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం

ఈ మ్యాచ్ స్టాండ్ ఇన్ దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అది భారత్‌కు ప్లస్ పాయింట్ అయింది. ఈ పిచ్‌లో తేమ ప్రభావం అంతగా ఉంటుందని ఊహించని కేశవ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. రెండో ఇన్నింగ్స్ సమయానికి తేమ ప్రభావం అధికం కావండతో.. స్పిన్ అంతగా ప్రభావం చూపలేదు. బంతి నేరుగా బ్యాట్ మీదకు రావడంతో బ్యాటర్లకు ఇన్నింగ్స్ నిర్మించడం ఈజీ అయింది. ఆట జరుగుతున్న కొద్దీ ట్రాక్ నెమ్మదిస్తుందని భావించిన సౌతాఫ్రికాకు చుక్కెదురైంది.

2. శ్రేయస్ అయ్యార్ సెంచరీ ఇన్నింగ్స్

2. శ్రేయస్ అయ్యార్ సెంచరీ ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ మొనగాడు శ్రేయస్ అయ్యార్ (113పరుగులు 111బంతుల్లో 15ఫోర్లు నాటౌట్) సెంచరీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వచ్చీ రాగానే బౌండరీలతో తన ఇన్నింగ్స్‌ను శ్రేయస్ చాలా పకడ్బందీగా సాగించాడు. అతను బాల్ టు రన్ పద్ధతిలో ఆడడంతో రిక్వయిడ్ రన్ రేట్ ఏమాత్రం గాడి తప్పకుండా సజావుగా సాగింది. అడపాదడపా బౌండరీలు బాదుతూ.. ఈజీగా సింగిల్స్ తీస్తూ ఇషాన్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా పద్ధతిగా ఆడాడు. ఎక్కడ కూడా ఛాన్స్ ఇచ్చేలా అతను తన ఇన్నింగ్స్ ఆడలేదు. మొత్తం ఇన్నింగ్స్ 15ఫోర్లు ఉన్నాయి గానీ ఒక్క సిక్సర్ కూడా లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మొండిగా నిలబడాలని అతను ఫిక్సయ్యాడని. ఇషాన్ కిషన్‌తో కలిసి 151పరుగుల భాగస్వామ్యం, సంజూతో కలిసి 70పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆటను భారత్ వశం చేశాడు.

3. ఇషాన్ కిషన్ దూకుడు

3. ఇషాన్ కిషన్ దూకుడు

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (93పరుగులు 84బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు) ఇన్నింగ్స్ ప్రేక్షకులను భలే అలరించింది. 48పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టైంలో ఇషాన్ కిషన్.. కుదురుకునే దాకా ఎంతో కుదురుగా ఆడాడు. అవసరమైనంత మేర శ్రేయస్ అయ్యార్‌కు స్ట్రైక్ ఇస్తూ.. కాస్త నెమ్మదించాడు. అయితే కాస్త టచ్‌లోకి వచ్చాక తన గేర్ పూర్తిగా మార్చేశాడు. 18ఓవర్లకు డ్రింక్స్ బ్రేక్ పూర్తయ్యాక.. మరో ఎండ్‌లో అయ్యార్ సహకారంతో దక్షిణాఫ్రికా బౌలర్లపై రెచ్చిపోయాడు. కేశవ్ మహరాజ్ వేసిన 19, 21 ఓవర్లలో మూడు సిక్సులు బాదాడు. నార్జ్ వేసిన 32వ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదిన ఇషాన్ తన ఫుల్ షాట్లతో అలరించాడు. జోరు మీదున్న ఇషాన్ 93వద్ద హిట్ చేయాలని చూసి క్యాచ్ ఔటయ్యాడు. తద్వారా తన డెబ్యూ సెంచరీ మిస్సయ్యాడు. అయినప్పటికీ ఇండియా గెలుపునకు మంచి ఊతమిచ్చే ఇన్నింగ్స్ ఆడాడు.

4. బౌలింగ్లో సిరాజ్ ప్రతాపం

4. బౌలింగ్లో సిరాజ్ ప్రతాపం

భారత బౌలింగ్ దళంలో షమీ, బుమ్రా, దీపక్ చాహర్, భువీ లాంటి నాయక బౌలర్ లేని లోటును సిరాజ్ అద్భుతంగా భర్తీ చేశాడు. ఆద్యంతం లైన్ అండ్ లెంత్‌ను పాటిస్తూ సిరాజ్ నిప్పులు చెరిగాడు. అతను తన 10ఓవర్లలో కేవలం 38పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా మూడు కీలక వికెట్లు తీశాడు. అతని దెబ్బకు ప్రమాదకర డికాక్ (5), హాఫ్ సెంచరీతో కుదురుకున్న హెండ్రిక్స్ (74) ఔటయ్యారు. చివర్లో విలువైన ఇన్నింగ్స్ ఆడే కేశవ్ మహరాజ్ (5) ను కూడా సిరాజ్ ఔట్ చేశాడు. అతను ఓ మెయిడిన్ కూడా వేశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు సిరాజ్ వేసిన పవర్ ప్లే, మిడిల్, డెత్ ఓవర్లలో పరుగులు రాబట్టలేకపోయారు. అది వారి స్కోరుకు అడ్డుకట్ట వేసి భారత్‌కు ప్లస్ పాయింట్ అయ్యేలా చేసింది.

5. చివర్లో రన్స్ లీక్ చేయకపోవడం

5. చివర్లో రన్స్ లీక్ చేయకపోవడం

దక్షిణాఫ్రికా 37.5ఓవర్లకు 215పరుగులు చేసి కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ తరుణంలో ఆ జట్టు స్కోరు అలవోకగా 300 దాటుతుందనిపించింది. అయితే భారత బౌలర్లు చివర్లో బలంగా పుంజుకున్నారు. 215 పరుగుల వద్ద ప్రమాదకర క్లాసెన్, క్లాసిక్ బ్యాటర్ మార్కరమ్ ఔటయ్యారు. దీంతో స్కోరు నెమ్మదించింది. భారత బౌలర్లు అవేష్ ఖాన్, కుల్దీప్, శార్దూల్, సుందర్, సిరాజ్ చివరి ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ప్రమాదకర మిల్లర్ లాంటి బ్యాటర్ క్రీజులో ఉన్నప్పటికీ.. చివరి 12ఓవర్లలో దక్షిణాఫ్రికా చేసింది కేవలం 63పరుగులు మాత్రమే. డెత్ ఓవర్లలో రన్స్ లీక్ చేయకపోవడం భారత్‌కు అతి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా సిరాజ్, శార్దూల్ బౌలింగ్ వాహ్వా అనిపించింది.

Story first published: Monday, October 10, 2022, 7:55 [IST]
Other articles published on Oct 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+