Top 5 Best Base Price Players: ఈ ప్లేయర్లకు బేరాల్లేవమ్మా.. భలే ఇరగదీస్తున్నారుగా!

ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడంతో ఎక్కువమంది దేశవాళీ ప్లేయర్లకు అవకాశాలు దక్కాయి. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లకు భారీ మొత్తంలో నజరానా దక్కింది. కాస్ట్‌లీ ప్లేయర్లు కొందరు రాణిస్తుండగా.. కొందరు అంతంతమాత్రమే ఆడుతున్నారు. అయితే కొందరు ప్లేయర్లపై ఫ్రాంఛైజీలు వేలంలో ఎలాంటి బేరాలకు దిగలేదు. వారు బేస్ ధరకే అమ్ముడుపోయినా తమ ప్రదర్శనతో జట్టులో కీలక ప్లేయర్లుగా మారారు. ఈ సీజన్‌లో బేస్ ధరకే అమ్ముడుపోయినప్పటికీ అత్యుత్తమంగా రాణిస్తున్న అయిదుగురు ప్లేయర్ల గురించి ఓసారి పరిశీలిస్తే..

భానుక రాజపక్స
ఈ శ్రీలంకన్ ప్లేయర్.. శ్రీలంక తరఫున టీ20ల్లో రాణిస్తుండడంతో ఐపీఎల్లో మంచి ధర పలుకుతాడని అందరూ తొలుత భావించారు. కానీ అతని బేస్ ప్రైస్ అయిన రూ.50లక్షలకే అతన్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఈ బ్యాటర్ మాత్రం పెట్టిన పైసల కన్న అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు కొనుగోలు చేసిన ప్లేయర్లలో విలువైన ఎంపికగా మారాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో 201పరుగులు చేసిన రాజపక్స 28.71సగటుతో 165స్ట్రైక్‌రైట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.

ముఖేష్ చౌదరి
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న 25ఏళ్ల ముఖేష్ చౌదరి.. పవర్ ప్లేలో మంచి బౌలింగ్ ప్రదర్శన కనబర్చుతున్నాడు. తొలుత కొన్ని మ్యాచ్‌లలో అంతగా ఆకట్టుకోని ముఖేష్ చౌదరి.. తర్వాత పుంజుకున్నాడు. ఆడిన 10మ్యాచ్‌లలో 13వికెట్లు తీసిన ముఖేష్ చౌదరి, కొన్ని మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శనలు కూడా చేశాడు. అయితే అతను తన బౌలింగ్ స్పెల్‌లో సగటున 25.54పరుగులు ఇస్తున్నాడు. ఇక ఇతన్ని చెన్నై కేవలం బేస్ ప్రైస్ రూ.20లక్షలకే కొనుగోలు చేయడం గమనార్హం. దీపక్ చాహర్ స్థానంలో రెగ్యులర్ బౌలర్‌గా ముఖేష్ మారిపోయాడు.

మొహ్సిన్ ఖాన్
3. మొహ్సిన్ ఖాన్
ఈ టోర్నీలో సక్సెస్ ఫుల్ జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. ఈ జట్టు తరఫున పలువురు అన్ క్యాప్ ప్లేయర్లు సత్తా చాటారు. అందులో చెప్పుకోదగ్గ ప్లేయర్ మొహ్సిన్ ఖాన్. అతన్ని రూ.20లక్షల బేస్ ప్రైస్‌కు లక్నో దక్కించుకుంది. ఆ లెఫ్టార్మ్ పేసర్ 5 మ్యాచ్‌ల్లో 9వికెట్లు తీశాడు. అలాగే అతని ఎకానమీ సైతం 6పరుగులు మాత్రమే ఉండడం విశేషం. ఇక దుష్మంత్ చమీర, జాసన్ హోల్డర్ లాంటి ప్లేయర్లతో సమానంగా బౌలింగ్ చేస్తున్న మొహ్సిన్ ఖాన్.. బేస్ ప్రైస్‌కు దక్కిన మంచి ప్లేయర్లలో ఒకడు.

ఉమేష్ యాదవ్
ఐపీఎల్ మెగా ఆక్షన్లో మంచి ధర పలుకుతాడనుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్ ఉమేష్ యాదవ్‌కు ఫ్రాంఛైజీల నుంచి అంతా డిమాండ్ రాలేదు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని తన బేస్ ప్రైస్ అయిన రూ.2కోట్లకు సొంతం చేసుకుంది. ఫామ్‌లో లేని ఉమేష్ యాదవ్‌ను కొనుక్కోవడం పట్ల కోల్ కతా జట్టుపై విమర్శలు వచ్చాయి. కానీ ఆ విమర్శలు తప్పని నిరూపిస్తూ.. ఆడిన 10మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసి ఉమేష్ యాదవ్ రాణించాడు. అలాగే తన ఎకానమీని కూడా 7పరుగుల దిగువనే ఉంచి తను ధరకు తగ్గ ప్లేయర్ అని నిరూపించాడు.

టిమ్ సౌథీ
కోల్ కతా నైట్ రైడర్స్ బేస్ ధరకే దక్కించుకున్న మరో మంచి ప్లేయర్ టిమ్ సౌథీ. ఈ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ 7 మ్యాచ్‌లలో 12వికెట్లు తీసి కేకేఆర్ తరఫున కన్సిస్టెన్సీగా బౌలింగ్ చేస్తున్నాడు. అతన్ని తన బేస్ ప్రైస్ అయిన రూ.1.50కోట్లకే కోల్ కతా దక్కించుకుంది. ప్యాట్ కమ్మిన్స్ లాంటి ఆసీస్ ప్లేయర్‌ను కాదని కోల్‌కతా సౌథీని పలు మ్యాచ్‌ల్లో తీసుకుంది. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సౌథీ నిలబెట్టే ప్రదర్శన చేశాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీయడమే కాకుండా మంచి ఎకానమీతో బౌలింగ్ వేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications