
లియామ్ లివింగ్‌స్టన్ - 117మీటర్లు
ఈసారి ఐపీఎల్లో లాంగెస్ట్ సిక్సర్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్ 117మీటర్ల భారీ సిక్సర్ బాది నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ హార్డ్ హిట్టర్ భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 27బంతుల్లో 64పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లున్నాయి. ఇందులో భారత ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్లో లెంగ్త్ డెలివరీని పికప్ చేసిన లివింగ్‌స్టన్ మిడ్ వికెట్ దిశగా 117మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ లివింగ్ స్టోన్. 184 స్ట్రైక్ రేటుతో 315పరుగులు చేశాడు.

డెవాల్డ్ బ్రెవిస్ - 112మీటర్లు
పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్లో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ భారీ హిట్టింగ్‌కు దిగాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. అందులో 112మీటర్ల భారీ సిక్స్ కూడా ఉంది. 18ఏళ్ల డెవాల్డ్ బ్రెవిస్ రాహుల్ చాహర్ వేసిన ఓవర్‌లోని నాలుగో బంతిని వైడ్ లాంగ్-ఆన్ ఫీల్డర్‌పై భారీ సిక్సర్ బాదాడు. బ్రెవిస్ ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, 150కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 124పరుగులు చేశాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న రాబోయే టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా టీంలో బ్రెవిస్ ఉండే అవకాశముంది.

లియామ్ లివింగ్‌స్టన్ - 108మీటర్లు
పంజాబ్ కింగ్స్ జట్టు రూ.11.5కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హార్డ్-హిట్టింగ్ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ముఖేష్ చౌదరి బౌలింగ్లో 108మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ముఖేశ్ చౌదరి వేసిన లెంత్ డెలివరీని లివింగ్ స్టన్ మిడ్ వికెట్ దిశగా హిట్ చేశాడు. ఇక అదే ఓవర్లో 26పరుగులు పిండుకున్నాడు. ఆ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కేవలం 32బంతుల్లో 60పరుగులు చేశాడు. ఈ ఎడిషన్‌లో 25సిక్సర్లు కొట్టిన లివింగ్‌స్టన్ వాటిలో చాలా వరకు 100మీకన్న లాంగ్ సిక్సర్లే ఉన్నాయి. ప్రస్తుతం అతను జోస్ బట్లర్ (37), ఆండ్రీ రస్సెల్ (27) తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

నికోలస్ పూరన్ - 108మీటర్లు
సన్ రైజర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఛేదనలో 62పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్జ్ బౌలింగ్లో 108మీటర్ల విధ్వంసక సిక్సర్ బాదాడు. నార్జ్ లెంగ్త్ డెలివరీ వేయగా.. డీప్ మిడ్ వికెట్ దిశగా పూరన్ ఈ సిక్సర్ బాదాడు. ఇటీవలే వెస్టిండీస్ కెప్టెన్ గా పూరన్ నియమితుడైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో 52.2సగటుతో రెండు అర్ధ సెంచరీలతో సహా 147.46 స్ట్రైక్ రేటుతో పూరన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

జాస్ బట్లర్ - 107మీటర్లు
ఈ ఏడాది సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో నంబర్ 1గా కొనసాగుతున్న జాస్ బట్లర్ ఈ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 116పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు బట్లర్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో 107మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 65బంతుల్లో తొమ్మిది సిక్సర్ల సహాయంతో సెంచరీ బాదాడు. ఈ సీజన్లో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 618పరుగులు చేసిన బట్లర్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతను 2016లో విరాట్ కోహ్లీ ఒకే సీజన్లో 973పరుగుల చేసిన రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
