
మిథాలీ @ 1:
అత్యధిక డబ్బు సంపాదించే భారత మహిళా క్రికెటర్ వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్. బీసీసీఐ గ్రేడ్-బి కాంట్రాక్ట్ లిస్టులో మిథాలీ ఉంది. బీసీసీఐ ద్వారా మిథాలీకి ఏటా రూ .30 లక్షలు దక్కుతుంది. అలెన్ సోలే, అమెరికన్ టూరిస్టర్, నెక్స్ట్‌జెన్ ఫిట్‌నెస్ స్టూడియో, రాయల్ ఛాలెంజ్ వంటి పెద్ద సంస్థలకు మిథాలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. వీటి ద్వారా మిథాలీ టాప్‌లో ఉంది. 37 ఏళ్ల మిథాలీ వన్డే క్రికెట్‌లో దాదాపు 7,000 పరుగులు సాధించింది. 189 ఇన్నింగ్స్‌లలో ఆమె సగటు 50.64గా ఉంది.

హర్మన్‌ప్రీత్ @ 2:
మిథాలీ రాజ్ తర్వాతి స్థానంలో టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. హర్మన్‌ప్రీత్ బీసీసీఐ గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ లిస్టులో ఉంది. బీసీసీఐ ద్వారా హర్మన్ ఏటా రూ .50 లక్షలు సంపాదిస్తుంది. ఆమె బ్యాట్ స్పాన్సర్ సియాట్ స్పాన్సర్‌షిప్‌లో భాగం. కౌర్ 114 టీ20 మ్యాచ్‌లలో రెండు వేలకు పైగా పరుగులు చేసింది. టీ20లలో ఓ సెంచరీ కూడా చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియాను తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా కూడా నిలిచింది.

మంధాన @ 3:
మూడో స్థానంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఉంది. మంధానకు బీసీసీఐ గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ ఉంది. దీని ప్రకారం ఆమె ఏడాదికి రూ .50 లక్షలు ఆర్జిస్తుంది. ఆమెకు రెండు టాప్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కూడా ఉన్నాయి. బ్యాట్ స్పాన్సర్ హీరో మోటోకార్ప్, ఎనర్జీ డ్రింక్ కంపెనీ రెడ్ బుల్‌తో ఆమెకు ఒప్పందాలు ఉన్నాయి. భారత జట్టులో రెగ్యులర్ ఓపెనర్ అయిన మంధాన టీ20 ప్రపంచకప్లో మాత్రం పూర్తిగా విఫలమయింది.

పూనమ్ @ 4:
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల లెగ్ బ్రేక్ బౌలర్ పూనమ్ యాదవ్ నాలుగో స్థానంలో ఉంది. ఇతర మహిళా క్రికెటర్ల మాదిరిగా యాదవ్‌కు చాలా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు లేవు. కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో యాదవ్ 150పైగా వికెట్లు తీసి అద్భుతంగా రాణించడంతో బీసీసీఐ గ్రేడ్-ఏ కాంట్రాక్టును పొందింది. ఏటా 50 లక్షల రూపాయలు సంపాదిస్తుంది .అయితే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆమె సంపాదన పెరుగుతుందని అంచనా. ఎందుకంటే టీ20 ప్రపంచకప్లో ఏకంగా 10 వికెట్లతో రాణించింది.

గోస్వామి @ 5:
బెంగాల్‌కు చెందిన 37 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి అత్యధిక డబ్బు సంపాదించే భారత మహిళా క్రికెటర్లలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. గోస్వామి టీమిండియా తరపున 10 టెస్టులు, 182 వన్డేలు, 68 టీ20లు ఆడి 300 వికెట్లు పడగొట్టింది. 2019-20 సీజన్‌కు గోస్వామికి గ్రేడ్-బి కాంట్రాక్టు దక్కింది. దీని ప్రకారం గోస్వామి రూ .30 లక్షలు సంపాదిస్తుంది.


Click it and Unblock the Notifications
