చివరి వరకు ఉత్కంఠ: వరల్డ్‌కప్ టోర్నీలో టాప్-5 అత్యుత్తమ గేమ్స్

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. టోర్నీలో భాగంగా మే30న జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఇప్పటికే లండన్‌కు చేరుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
45 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మెగా టోర్నీలో అభిమానులు 500 పరుగులు స్కోరు బోర్డుని చూసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ మెగా టోర్నీలో టాప్-4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
ఇక, జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన గత పదకొండు వరల్డ్‌కప్‌ల్లో టాప్-5 గేమ్స్‌ను ఒక్కసారి పరిశీలిద్దాం...

1999: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా సెమీపైనల్, బర్మింగ్ హామ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు ఆస్ట్రేలియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా జట్టు తరుపున బెవాన్(65), స్టీవ్ వా(56) పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక, దక్షిణాఫ్రికా బౌలర్లలో షాన్ పొల్లాక్ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అలెన్ డొనాల్డ్ నాలుగు వికెట్లు తీయగా... జాక్వస్ కల్లిస్ ఒక వికెట్ తీశాడు. ఇక, లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా సైతం 213 పరుగులే చేయడంతో ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్ టైగా ముగియడంతో ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ కీలకపాత్ర పోషించాడు. దీంతో వార్న్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

2015: గ్రూప్ స్టేజిలో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ ఒక వికెట్ తేడాతో విజయం, ఆక్లాండ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లోల ట్రెంట్ బౌల్డ్, డానియేల్ వెటోరి చెలరేగడంతో ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌటైంది. ఆస్టేలియా బ్యాట్స్‌మెన్లలో హాడ్డిన్ (43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ ఐదు వికెట్లు తీయగా, టిమ్ సౌథీ, వెటోరి రెండు వికెట్లు, ఆండర్సన్‌కు ఒక వికెట్ లభించింది. అనంతరం చేధనలో న్యూజిలాండ్ 23.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ట్రెంట్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

2011: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ టై, బెంగళూరు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాట్స్‌మెన్లలో సచిన్ టెండూల్కర్(120) సెంచరీతో చెలరేగగా... గౌతమ్ గంభీర్(51), యువరాజ్ సింగ్(58) హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో 49.5 ఓవర్లకు గాను టీమిండియా 338 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో టిమ్ బ్రెస్నన్ 5 వికెట్లు తీయగా ఆండర్సన్, గ్రేమ్ స్వాన్, మైకేల్ యార్డీ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కూడా సరిగ్గా 338 పరుగులే చేయడంతో ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఇంగ్లాండ్ తరుపున ఆండ్రూ స్ట్రాస్(158) సెంచరీ సాధించగా ఇయాన్ బెల్(69) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

2011: దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 6 పరుగుల తేడాతో విజయం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ 45.4 ఓవర్లకు గాను 171 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ తరుపున రవి బోపారా(60), ట్రాట్(52) హాఫ్ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ నాలుగు వికెట్లు తీయగా, పీటర్సన్ మూడు, మోర్కెల్ రెండు, స్టెయిన్ ఒక వికెట్ తీశారు. అనంతరం చేధనలో దక్షిణాఫ్రికా 47.4 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2011 వరల్డ్‌కప్‌లో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు రవి బొపారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

2007: శ్రీలంకపై వికెట్ తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా
అత్యంత నిరాశగా ముగిసిన ఈ వరల్డ్‌కప్‌లో ఇదే అత్యుత్తమ గేమ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మహేలా జయవర్దనే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సఫారీ బౌలర్ల దెబ్బకు శ్రీలంక 49.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో దిల్షాన్(58), ఆర్నాల్డ్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం చేధనలో దక్షిణాఫ్రికా 160 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో లంక పేసర్ లసిత్ మలింగ హ్యాట్రిక్ వికెట్లు తీసి మాయ చేశాడు. దక్షిణాఫ్రికా టాప్ స్కోరర్ జాక్వస్ కల్లిస్(86)తో పాటు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడంతో సఫారీలు 207 పరుగులకే కప్పకూలారు. దీంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంక వికెట్ తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications