వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు సాధించిన టాప్-5 బ్యాట్స్‌మెన్ వీరే


హైదరాబాద్: 47 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం 40 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే 7000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
అంతేకాదు ఈ మైలురాయిని సాధించేందుకు అత్యంత తక్కువ ఇన్నింగ్స్ (181) తీసుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అతడికంటే ముందు హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా, 150), విరాట్ కోహ్లీ (ఇండియా, 161), ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా, 166), సౌరవ్ గంగూలీ (ఇండియా, 174) ఉన్నారు.
వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల చేసిన బ్యాట్స్‌మెన్లు వీరే:

హాషీం ఆమ్లా, 150 ఇన్నింగ్స్‌లు
వన్డేల్లో అత్యంత వేగంగా ఏడువేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన హాషీం ఆమ్లా ఆగ్రస్థానంలొ కొనసాగుతున్నాడు. నిజానికి ఆమ్లా పేరు ఈ జాబితాలో ఉండటం అభిమానలను ఆశ్చర్యపరిచేదే. అయితే, దక్షిణాఫ్రికా జట్టు తరుపున గత ఐదేళ్లలో ఆమ్లా అనేక అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. ప్రస్తుతం వన్డేల్లో ఆమ్లా 7696 పరుగులు సాధించాడు. మరో 8 ఇన్నింగ్స్‌ల్లో ఆమ్లా 304 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమిస్తాడు. కోహ్లీ 175 ఇన్నింగ్స్‌ల్లో 8000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

విరాట్ కోహ్లీ, 161 ఇన్నింగ్స్‌లు
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. అభిమానులు ముద్దుగా రన్ మెషిన్ అని పిలుచుకుంటారు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ కేవలం 161 ఇన్నింగ్స్‌ల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 58 యావరేజితో 9779 పరుగులు సాధించాడు.

ఏబీ డివిలియర్స్, 166 ఇన్నింగ్స్‌లు
మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యత్తుమ బ్యాట్స్‌మెన్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. చాలా మంది క్రికెటర్లు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన ఈ మైలురాయిని అందుకుంటే, డివిలియర్స్ మాత్రం నాలుగో నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ 101 స్ట్రైక్ రేట్‌తో 53.5 యావరేజితో వన్డేల్లో మొత్తం 9500 పరుగులు సాధించాడు.

సౌరవ్ గంగూలీ, 174 ఇన్నింగ్స్‌లు
తన 174వ ఇన్నింగ్స్‌లో సౌరవ్ గంగూలీ ఈ మైలురాయిని అందుకున్నాడు. స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే ఈ టీమిండియా మాజీ కెప్టెన్ భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను కట్టబెట్టాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్‌తో కలిసి గంగూలీ ఎన్నో ఓపెనింగ్ రికార్డులను సృష్టించాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ 41 యావరేజితో 11363 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ శర్మ, 181 ఇన్నింగ్స్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. అనంతరం భారత్ 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 238 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (100 బంతుల్లో 114; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ రోహిత్ శర్మ (119 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 19వ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరు తొలి వికెట్‌కు 33.3 ఓవర్లలో 210 పరుగులు జోడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications