Rohit Sharma : నా కెరీర్లో మూడు కీలక ఘట్టాలు ఇవే.. వాటి వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను

భారత కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్‌లో కొన్ని కీలక ఘట్టాలను పంచుకున్నాడు. వాటి వల్లే భారత క్రికెట్లో ప్రస్తుతం తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. రోహిత్ కెరీర్ ప్రారంభంలో తరచూ జట్టులో నుంచి డ్రాప్ అయ్యేవాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో అయితే 2020వరకు కూడా అతను తరచు డ్రాప్ అయ్యేవాడు. ఏదేమైనా ఎన్నో కఠినమైన పరిస్థితులను అతను అధిగమించగలిగాడు. అందువల్ల ప్రస్తుతం భారత జట్టుకు ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్'లో అతను మాట్లాడుతూ తన కెరీర్‌లో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయని, అయితే అందులో మూడు కీలక టర్నింగ్ పాయింట్లు ఉన్నాయని చెప్పాడు.

అక్కడ రాణించడం వల్లే, తర్వాత ధోనీ వల్లే
‘నేను అరంగేట్రం చేసినప్పడు.. జాతీయ సెలెక్టర్ల ఫోకస్‌లో పడడానికి దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణించాల్సి వచ్చింది. ముఖ్యంగా అండర్-19 టోర్నమెంట్‌లో బాగా రాణించడం వల్లే నాకు అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశమొచ్చింది. అదే నా కెరీర్లో మొదటి కీలక మలుపు అని నేను భావిస్తున్నాను' అని రోహిత్ అన్నాడు. ఎంఎస్ ధోనీ.. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్‌ను ఓపెనర్‌గా అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రమోట్ చేశాడు. ఇక అప్పటి నుంచి రోహిత్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజుకు వెళ్లింది. ‘2013లో నేను భారత్ తరఫున ఓపెనర్‌గా బ్యాటింగ్ ప్రారంభించడం నా జీవితంలో రెండో కీలక మలుపు.' అని రోహిత్ పేర్కొన్నాడు.

అది నా లైఫ్‌లో బిగ్ గేమ్ ఛేంజర్
ఇక 2013లోనే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ ఎంపికయ్యాడు. ‘ఆ ఏడాది నేను ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ అయ్యాను. నా జీవితంలో అది బిగ్ గేమ్ ఛేంజర్. కెప్టెన్సీ వల్ల ఆట పట్ల నా వైఖరిలో, నన్ను నేను నిర్వహించుకోవడంలో చాలా మార్పు వచ్చింది. ఆట గురించి నా అవగాహన విశాలమైంది. అలాగే ఇతరుల గురించి, సహచరుల గురించి కూడా అర్థం చేసుకోవడం అలవాటైంది. నేను నా తోటి క్రికెటర్ల నుంచి లా నేర్చుకున్నాను. నేను కెప్టెన్‌గా మారడంతో పాటు నా ఆట స్థాయి కూడా మార్చుకున్నాను.' అని రోహిత్ చెప్పాడు.


అప్పుడు ఏం చేశానో.. ఇప్పుడు అదే చేస్తున్నా
ప్రస్తుతం రోహిత్ విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతను కెప్టెన్సీ వహించిన అన్ని సిరీస్లో భారత్ గెలిచింది. రోహిత్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్లేయర్ల ఆట తీరులో చాలా మార్పులు కన్పిస్తున్నాయి. అలాగే ఆటగాళ్లు కూడా జట్టులో చోటు కోల్పోతామనే భయంతో కాకుండా చాలా ఫ్రీగా ఆడగలుగుతున్నారు. విఫలమైన ప్రతిసారి మరో అవకాశమిచ్చి వాళ్లను బ్యాకప్ చేస్తూ జట్టులో ఓ సానుకూల వాతావరణాన్ని ఏర్పరిచారు. ఇక తన కెప్టెన్సీ విషయం గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఏళ్లుగా నేను కెప్టెన్సీ ఎలా చేశానో.. అలాగే నేను టీమిండియాకు కూడా కెప్టెన్సీ వహిస్తున్నప్పుడు అంతే స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నా. కఠినంగా వ్యవహరించను. కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని చూస్తాను. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి అర్థమయ్యేలా చేస్తాను.' అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications