Year end 2019: టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన టాప్-3 బౌలర్లు వీరే!

హైదరాబాద్: టీ20ల్లో 2019 సంవత్సరం టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది టీమిండియా ఆడిన 16 మ్యాచ్‌ల్లో కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో బౌలింగ్ విభాగంపై ప్రత్యేకంగా జట్టు మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది.
అటు స్పిన్‌తో పాటు ఇటు పేస్ విభాగంలో ఈ ఏడాది టీమిండియా అనేక కాంబినేషన్లను ప్రయత్నించింది. వీటిలో చాలా వరకు అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాయి. 12 మ్యాచ్‌లు ఆడి 42.87 యావరేజితో కేవలం 8 వికెట్లు మాత్రమే తీయడంతో స్పిన్నర్ కృనాల్ పాండ్యా జట్టులో స్థానం కోల్పోయాడు.
ఇక, 8 మ్యాచ్‌లు ఆడి 37.14 యావరేజితో 7 వికెట్లు తీసిన పేసర్ ఖలీల్ అహ్మద్ పూర్తిగా నిరాశపరిచాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌లు ఆడిన సుందర్ 50 యావరేజితో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
2020లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-3 బౌలర్లను ఒక్కసారి చూద్దాం...

దీపక్ చాహర్
ఈ ఏడాది టీ20ల్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా దీపక్ చాహర్ నిలిచాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో దీపక్ చాహర్ ఏకంగా 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అంతేకాదు టీ20ల్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. చాహర్‌కు ముందు టీ20ల్లో శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్(6/8)తో అగ్రస్థానంలో ఉన్నాడు.

భువనేశ్వర్ కుమార్
ఈ ఏడాది మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 33.87 యావరేజితో 8 వికెట్లు పడగొట్టాడు. స్ట్రయిక్ రేట్ 24.7. ఇక, ఎకానమీ విషయానికి వస్తే 8.21గా నమోదైంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా లాడెర్హిల్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భువీ(2/19) తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

నవదీప్ షైనీ
అరంగేట్రం చేసిన తొలి టీ20లోనే నవదీప్ షైనీ అద్భుత ప్రదర్శన చేశాడు. లాడెర్హిల్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో నవదీప్ షైనీ 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, షిమ్రాన్ హెట్ మెయిర్‌లను తక్కువ స్కోర్లకే ఔట్ చేయడంతో వెస్టిండిస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఇక, మూడో టీ20లో షైనీ(2/34)తో చెలరేగడంతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications