For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఖాతాలోని అరుదైన టాప్ 10 రికార్డులివే..!

Top 10 Most Interesting Records of Suresh Raina

భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్, మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందిన సురేష్ రైనా అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌ వేదికగా ఈ సమాచారాన్ని అతను పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకు ఆడబోనని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో తనకు అవకాశం ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక థ్యాంక్స్ చెప్పాడు.

ఇక త్వరలో జరగబోయే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు మాత్రం సురేష్ రైనా అందుబాటులో ఉండనున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 లీగ్ ఫ్రాంచైజీలు ఆడే విషయమై సంప్రదిస్తున్నాయని ఈ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు.

 క్లుప్తంగా సురేష్ రైనా కెరీర్ ఇది..!

క్లుప్తంగా సురేష్ రైనా కెరీర్ ఇది..!

ఇకపోతే టీమిండియా తరఫున మొత్తంగా 18 టెస్ట్‌లు, 226 వన్డే ఇంటర్నేషనల్స్, 78 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు రైనా ఆడాడు. వన్డేల్లో 5,615. టీ20లలో 1605 పరుగులు చేశాడు. టెస్ట్‌లలో 768పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో సుదీర్ఘకాలం పాటు సీఎస్కేకు రైనా ఆడాడు. ఇక ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 32.52సగటుతో 5528పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ సహా 39 హాఫ్ సెంచరీలున్నాయి.

రైనా కెరీర్ సమాచారం

రైనా కెరీర్ సమాచారం

టెస్ట్ డెబ్యూ : శ్రీలంకతో తొలి టెస్టు, జులై 26, 2010, టెస్ట్ ముగింపు : ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ జనవరి 06, 2015

వన్డే అరంగేట్రం : శ్రీలంకతో తొలి వన్డే, జులై 30, 2005, వన్డే ముగింపు : ఇంగ్లాండ్‌తో చివరి వన్డే, ఏప్రిల్ 19, 2018

టీ20 డెబ్యూ : డిసెంబరు 01, 2006న దక్షిణాఫ్రికాతో తొలి టీ20, టీ20 ముగింపు : ఇంగ్లాండ్‌తో చివరి టీ20, జూలై 08, 2018

ఐపీఎల్ డెబ్యూ : ఏప్రిల్ 19, 2008లో పంజాబ్ కింగ్స్‌తో సీఎస్కే తరఫున, చివరి ఐపీఎల్ మ్యాచ్ : అక్టోబరు 02, 2021న రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్కే తరఫున

చెప్పుకోదగ్గ సురేష్ రైనా రికార్డులు, ఆసక్తికర విషయాలు

చెప్పుకోదగ్గ సురేష్ రైనా రికార్డులు, ఆసక్తికర విషయాలు

1. వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్, టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ

2. టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి భారత ప్లేయర్, 2010లో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై రైనా 101పరుగులు చేసి ఈ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో సెంచరీ చేసిన ఏకైన భారత లెఫ్టాండర్.

3. మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత ప్లేయర్ : హాంకాంగ్‌పై తన తొలి వన్డే సెంచరీని సాధించగా, శ్రీలంకపై తొలి టెస్టు శతకం,దక్షిణాఫ్రికాపై తన తొలి టీ20 సెంచరీ సాధించాడు.

4. ధోనీ (228) తర్వాత అత్యధిక మ్యాచ్‌లు (200) సీఎస్కే తరఫున ఆడిన ప్లేయర్

5. ఐపీఎల్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ : ఈ రికార్డు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 2008 నుంచి 2016 ఐపీఎల్లో సగం టోర్నీ పూర్తయ్యేవరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌ని రైనా మిస్ చేయలేదు. 9వ ఎడిషన్‌లో.. గుజరాత్ లయన్స్ తరఫున ఆడుతుండగా.. తన భార్య డెలివరీ ఉండడంతో మిస్సయ్యాడు. అతను వరుసగా 158 మ్యాచ్‌లు ఆడాడు.

6. ఐపీఎల్లో రైనా 5000పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

7. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు (714)పరుగుల రికార్డు రైనాదే. అతని తర్వాత ధోనీ (522పరుగులు) ఉన్నాడు.

8. ట్వంటీ20 కెరీర్‌లో 6000పరుగుల మైలురాయి, అలాగే 8000పరుగులు మైలురాయి చేసిన తొలి భారతీయ ప్లేయర్

9. ఐపీఎల్లో 100సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడు. క్రిస్ గేల్ తర్వాత ఆ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్

10. ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన 7వ బ్యాటర్, అతని సిక్సుల సంఖ్య 203, ఫోర్లు 506.

Story first published: Tuesday, September 6, 2022, 14:42 [IST]
Other articles published on Sep 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+