ప్రపంచ క్రికెట్‌లో అందమైన క్రికెటర్స్ వీళ్ళే!

ఇప్పుడు క్రికెట్ అంటే జెంటిలిమన్ గేమ్ మాత్రమే కాదు.. క్రికెట్ అందానికి స్టైల్ కి సంబందించినది అయిపోయింది. దానికితోడు క్రికెటర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తున్నారు. అంతేకాదు క్రికెటర్స్ కి ఉన్న క్రేజే వేరు. వాళ్ళ ఆటకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటే అందానికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక క్రికెటర్స్ చేసే బ్రాండ్స్, యాడ్స్ గురించి అయితే చెప్పకర్లేదు.
అయితే మరి క్రికెటర్స్ లో 2017 సంవస్థరానికి గానూ మోస్ట్ టాప్ 10 అందమయిన ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లి
ఇక ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నది మన విరాట్ కోహ్లి. అత్యంత ప్రతిభావంతుడైన కోహ్లి కెప్టెన్ హోదాలో అన్ని ఫార్మాట్స్ లో దూసుకుపోతూ ర్యాంకింగ్ లో ఆదరగోడుతూ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్సమన్ గా పేరొందాడు. ఇక భారీగా మహిళా అభిమానుల జాబితాను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉన్నాడు విరాట్ కోహ్లి. విరాట్ కోహ్లి ఇప్పుడు చాలా బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు, ఇక తన బ్రాండింగ్ పార్టనర్ అనుష్క ని రీసెంట్ గా కోహ్లి పెళ్లి కూడా చేస్కున్నాడు.

జేమ్స్ ఆండర్సన్
ఇక తరువాత జేమ్స్ ఆండర్సన్. ఇంగ్లాండ్ కి చెందిన ఈ ఆటగాడు ఒకపక్క క్రికెట్ ఆడుతూ ఫాషన్ డిజైనింగ్ లోకి అడుగుపెట్టాడు. అదే ఇతని ప్రత్యేకత. ఫాషన్ డిజైనర్ అయిన మొదటి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

బ్రెట్ లీ
బ్రెట్ బాబ్ లీ ఒక మాజీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్. వన్ ఆఫ్ ద హేండ్ సమ్ క్రికెటర్. తన అంతర్జాతీయ కెరీర్ లో బ్రెట్ లీ క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు పొందాడు.

ఇక తరువాత బ్రెండన్ మెక్కలమ్
బ్రెండన్ బారీ మెక్‌కలమ్ న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్. ఇతను ప్రతిభావంతుడైన వికెట్ కీపర్-కమ్ బ్యాట్స్మన్. ఇక పచ్చబొట్టుతో అతని బలమైన చేతులు ఎప్పుడూ మహిళల కు డార్లింగ్గా ఉంటాయి. తన క్రికెట్ తో కానీ తన కిల్లర్ లుక్ తో గానీ అందర్నీ ఆకట్టుకునే రూపం మెక్కలమ్ ది.

ఎబి డెవిలియర్స్ :
ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పొచ్చు. ఇతను దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు . తన విభిన్న మైన బ్యాటింగ్ శైలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇతను ప్రపంచంలోని అనేక మహిళల హృదయాలను దొంగిలించాడు.

కెవిన్ పీటర్సన్
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్. కెవిన్ పీటర్సన్ తన జీవిత చరిత్ర "కేపీ"ను బహిర్గతం చేశారు. ఇందులో అనేక అంశాలపై తన మనస్సులోని మాటను వెల్లడించారు.

ఇయాన్ మోర్గాన్
ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో భాగంగా ఉన్నాడు. ప్రపంచంలోని మహిళల డ్రీం జాబితాలో ఇతను ఉంటాడు. అతని గోధుమ రంగు నీలి కళ్ళు చాలామంది లేడీస్ గుండెను దొంగిలించాడు.

డేల్ స్టెయిన్
దక్షిణాఫ్రికా డేల్ స్టెయిన్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడు. తన బుల్లెట్ స్పీడ్ బాల్ లు అభిమానులను ఆకర్షించడమే కాక అతని కిల్లర్ లుక్ కనిపిస్తుంది అందులో. ఈ రైట్-ఆర్మ్ ఫాస్ట్ పేసర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మాయిల జాబితాలో ఎప్పుడూ ఉంటాడు.

షాహిద్ అఫ్రిది
ఈ మాజీ పాక్ ఆటగాడు కూడా లుక్స్ తో అందరిని ఆకట్టుకునేవాడు. విజయవంతమైన ఆల్ రౌండర్గా గౌరవం పొందాడు, అంతేకాక దూకుడు బ్యాటింగ్ శైలికి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు.

మిచెల్ జాన్సన్
మిచెల్ జాన్సన్ తన చేతిలో పచ్చబొట్టు కలిగి ఉన్న కిల్లర్ లుక్ ఉన్న ఆస్ట్రేలియన్ పేసర్. తన అందమైన రూపం ప్రపంచంలో అనేక మంది మహిళల హృదయాన్ని ఆకర్షిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications