Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలో టాప్-10 భారీ సిక్సర్లు ఇవే

 top 10 longest sixers in ipl history

ఐపీఎల్‌ అంటేనే పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్లో తమ హిట్టింగ్‌తో ప్లేయర్లు అభిమానులను అలరిస్తుంటారు. దాదాపు అన్ని ఐపీఎల్ సీజన్లలో సిక్సర్ల వర్షం కురిసింది. సిక్సర్ల‌పరంగా అత్యధిక సిక్సర్లు కొట్టినవారికి, అలాగే లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ప్లేయర్లకు నజరానాలు ఉంటాయి. గత సీజన్లో చెన్నై ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ 108మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు. ఇది ఆ సీజన్‌లో లాంగెస్ట్ సిక్సర్‌గా నమోదైంది. అలాగే కేఎల్ రాహుల్, కీరన్ పొలార్డ్ లాంటి మరికొందరు హిట్టర్లు సైతం 100మీటర్లకు మించిన సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో టాప్ 10లాంగెస్ట్ సిక్సర్ల గురించి ఒకసారి పరిశీలిస్తే..

రోహిత్ శర్మ - 115 మీటర్లు

రోహిత్ శర్మ - 115 మీటర్లు

దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ 2009సీజన్లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ శర్మ.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ మష్రఫీ మోర్తాజా బౌలింగ్లో 115మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ.. 'హిట్ మ్యాన్' అనే నిక్‌నేమ్ ట్యాగ్‌ను సుస్థిరం చేసుకున్నాడు.

 గౌతం గంభీర్ - 117 సిక్సర్లు

గౌతం గంభీర్ - 117 సిక్సర్లు

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ప్లేయర్, మరియు కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్లో 117మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. 2012,2014లో రెండుసార్లు తన కెప్టెన్సీలో కేకేఆర్‌కు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిపెట్టాడు.

 బెన్ కటింగ్ - 117మీటర్లు

బెన్ కటింగ్ - 117మీటర్లు

ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2016సీజన్లో ఆడాడు. ఆ సీజన్ ఫైనల్లో ఆర్సీబీతో సన్ రైజర్స్ తలపడగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 208పరుగులు చేసింది. ఛేదనలో భాగంగా చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన బెన్.. షేన్ వాట్సన్ బౌలింగ్లో 117మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. చివర్లో బెన్ కటింగ్ కేవలం 15 బంతుల్లో 39పరుగులతో చెలరేగడంతో సన్ రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

 రాస్ టేలర్ -119 మీటర్లు

రాస్ టేలర్ -119 మీటర్లు

2008లో ఐపీఎల్ తొలి సీజన్లో మొత్తం 620 సిక్సర్లొచ్చాయి. ఆ సీజన్లో బెంగళూరుకు ఆడిన రాస్ టేలర్ చెన్నైపై మ్యాచ్‌లో చెన్నై బౌలర్ జాకబ్ ఓరమ్ బౌలింగ్లో 119మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. కేవలం 32బంతుల్లో 54 పరుగులు చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది.

యువరాజ్ సింగ్ - 119మీటర్లు

యువరాజ్ సింగ్ - 119మీటర్లు

టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ 2009లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున కెప్టెన్‌గా ఆడుతుండగా... చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్బీ మోర్కెల్‌ బౌలింగ్లో 119మీటర్ల పొడవైన సిక్సర్‌ బాదాడు. ఐపీఎల్‌లో యువరాజ్ 126ఇన్నింగ్స్‌ల్లో 149సిక్సర్లు బాదాడు.

 క్రిస్ గేల్ - 119మీటర్లు

క్రిస్ గేల్ - 119మీటర్లు

లాంగెస్ట్ సిక్సర్ల గురించి మాట్లాడేటప్పుడు క్రిస్ గేల్‌ పేరు రాకుండా ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు గేల్. ఐపీఎల్లో 357సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. 2013లో అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడుతున్నప్పుడు పూణే వారియర్స్ జట్టుపై పూణే బౌలర్ అశోక్ దిండా బౌలింగ్‌లో 119మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.

 రాబిన్ ఉతప్ప - 120మీటర్లు

రాబిన్ ఉతప్ప - 120మీటర్లు

రాబిన్ ఉతప్ప లాంటి క్లాసిక్ బ్యాటర్ టాప్ 10లాంగెస్ట్ సిక్సర్ల జాబితాలోనూ ఉన్నాడు. 2010లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నప్పుడు 120మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు. మధ్యలో చాలా సీజన్లలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ రాబిన్ ఉతప్ప ప్రస్తుత సీజన్లో చెన్నై తరఫున మళ్లీ ఫాం అందుకుని రాణిస్తున్నాడు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 122 మీటర్లు

ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 122 మీటర్లు

ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్నప్పుడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 122 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్లీ.. ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో ఒంటరి పోరాటం చేశాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2008 నుంచి 2012మధ్య ఐపీఎల్ ఆడాడు. అతను కింగ్స్ XIపంజాబ్, డెక్కన్ ఛార్జర్స్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2009లో తన కెప్టెన్సీలో డెక్కన్ ఛార్జర్స్‌‌కు టైటిల్ సాధించి పెట్టాడు.

ప్రవీణ్ కుమార్ - 124మీటర్లు

ప్రవీణ్ కుమార్ - 124మీటర్లు

ఐపీఎల్ చరిత్రలో టాప్ 10లాంగెస్ట్ సిక్సర్ల జాబితాలో ఒక బౌలర్ పేరు ఉండడం నమ్మశక్యం కాకున్నా అది నిజం. 2008లో ఆర్సీబీ తరఫున ఆడిన ప్రవీణ్ కుమార్.. రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు 78/6 కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో యూసుఫ్ పఠాన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్‌లో 124మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు.

అల్బీ మోర్కెల్ - 125మీటర్లు

అల్బీ మోర్కెల్ - 125మీటర్లు

మరీ ఇంతకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ సిక్సర్ బాదిన ప్లేయర్ ఎవరో చెబితే ఆశ్చర్యపోక మానరు. దక్షిణాప్రికా మాజీ ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ ఈ ఫీట్ సాధించాడు. ధోని, గేల్ లాంటి హిట్టర్ల కన్నా సుదూర సిక్సర్ బాదిన జాబితాలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన మోర్కెల్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్లో 125 మీటర్ల సిక్సర్‌ని బాదాడు. చెన్నై అత్యుత్తమ ఫినిషర్లలో ఆల్బీ మోర్కెల్ ఒకరు

Story first published: Wednesday, April 20, 2022, 21:29 [IST]
Other articles published on Apr 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+