IPL 2025: సన్‌రైజర్స్ మగాడ్రా బుజ్జి - ఐపీఎల్‌లో టాప్ 10 అత్యధిక స్కోర్లు ఇవే
IPL Top 10 Highest Scores: ఐపీఎల్ అంటేనే బౌలర్లు బెంబేలెత్తేలా, బంతులు పగిలిపోయేలా బ్యాటర్లు చెలరేగుతుంటారు. ఈ మెగాలీగ్‌లో ధనాదన్ బాదడమే బ్యాటర్ల పని. ఈ రిచ్ క్యాచ్ లీగ్ ప్రారంభమైనప్పటి (2008) నుంచి కొన్ని మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ లతో పాటు అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ లకు వేదికగా మారింది ఐపీఎల్.
అందుకే దాదాపుగా ఈ ఐపీఎల్ మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. అయితే ఐపీఎల్ 2025 మజా మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నమోదైన టాప్ 10 అత్యధిక పరుగులు రికార్డు ఏంటి?, ఏ జట్టు ఎవరిపై బాదింది? సహా పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

- ఐపీఎల్ లో అత్యధిక టోటల్ స్కోరు బాదిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. 2024లో దిల్లీ క్యాపిటల్స్ పై 287/3 చేసింది.
- 2024లో హైదరాబాద్ జట్టు.. ముంబయి ఇండియన్స్ టీమ్ పై 277/3 చేసి రెండో అత్యధిక స్కోర్ అందుకుంది.
- 2024లో వైజాగా వేదికగా జరిగిన మ్యాచ్ లో కేకేఆర్.. దిల్లీ క్యాపిటల్స్ పై 272/7 స్కోర్ చేసింది.
- 2013లో ఆర్సీబీ 263/5 అత్యధిక స్కోరును పుణె వారియర్స్ పై సాధించింది.
- 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ 262/2 స్కోర్ చేసింది.
- 2024లో హైదరాబాద్ జట్టుపై ఆర్సీబీ 262/7 అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది.
- 2024లో పంజాబ్ కింగ్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ 261/6 సాధించింది.
- 2024లో ముంబయి ఇండియన్స్ పై దిల్లీ క్యాపిటల్స్ 257/4 టోటల్ స్కోర్ ను అందుకుంది.
- 2023లో పంజాబ్ కింగ్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 257/5 చేసింది.
Story first published: Tuesday, March 18, 2025, 9:46 [IST]
Other articles published on Mar 18, 2025
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications