గొప్ప అవకాశంగా భావించా: నాలుగో స్ధానంపై పాండ్యా (వీడియో)
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. తొలి మూడు వన్డేల్లో రెండు మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
చెన్నై వన్డేలో ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన పాండ్యా.... ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కూడా నాలుగో స్ధానంలో దిగిన పాండ్యా టీమిండియాను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వన్డేలో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు రావడంపై ప్యాండ్యా తనదైన శైలిలో స్పందించాడు.

ఇండోర్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి
మూడో వన్డే అనంతరం ఇండోర్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో నాలుగో వన్డే జరిగే బెంగళూరుకి పయనమైంది. విమాన ప్రయాణం మధ్యలో టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ తన పక్కనే కూర్చుని ఉన్న పాండ్యా, అక్షర్ పటేల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకుంది.
పాండ్యాకు కేఎల్ రాహుల్ కొన్ని ప్రశ్నలు
కేఎల్ రాహుల్: ఇండోర్ వన్డేలో ఎప్పుడూ వచ్చే స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేయడం ఎలా ఉంది?
పాండ్యా: నన్ను నేను నిరూపించుకోవడానికి దీనిని ఓ గొప్ప అవకాశంగా భావించా. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్తానని తెలిసినప్పుడు చాలా సంతోషించాను.
కేఎల్ రాహుల్: నాలుగో వన్డే జరిగే బెంగళూరు సిటీ గురించి?
పాండ్యా: బెంగళూరు అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. చాలా రెస్టారెంట్లు ఉంటాయి. హోటల్‌లో కూర్చుని తినడం కన్నా బయటకు వెళ్లి తినడాన్నే ఇష్టపడతా. ఇంకా.. నీ కారు కూడా డ్రైవ్ చేయాలి.

అక్షర్ పటేల్ పేరు వెనకున్న రహస్యం ఇదే
ఆ తర్వాత పాండ్యా పక్కనే ఉన్న అక్షర్ పటేల్ పేరు వెనుక ఉన్న కథ ఏంటో కేఎల్ రాహుల్ అడిగి తెలుసుకున్నాడు. అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో అర్జెంట్‌గా పాస్ పోర్టు అవసరమైంది. దీంతో మా నాన్ని స్కూల్ సర్టిఫికెట్ కోసం పంపగా స్కూల్ యాజమాన్యం తన పేరుని అక్షర పటేల్‌గా పేర్కొంది. తన పాస్ పోర్టులో అదే పేరు రావడంతో అప్పటి నుంచి తన డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇలా అన్నింటిలో అదే పేరు వస్తోందని అక్షర్ పటేల్ తెలిపాడు.

సంతోషం వ్యక్తం చేసిన రాహుల్
అనంతరం పాండ్యా బెంగళూరుకి రావడంపై తన స్పందనను తెలియజేయమని కేఎల్ రాహుల్‌ని అడిగాడు. దీంతో బెంగళూరు రావడం పట్ల రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సిరిస్‌కు ముందు తాను గాయపడి బెంగళూరులో ఉన్నానని రాహుల్ తెలిపాడు. చాన్నాళ్లుగా ఇక్కడే ఉంటున్నానని బెంగళూరులోనే తన స్నేహితులు ఉన్నారని రాహుల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications