For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకకు చెమటలు పట్టించిన అప్ఘాన్: ఆదుకున్న మహేల, పెరీరా

డ్యునెదిన్: ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 233 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక మరో 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

మహేల జవర్ధనే 148 బంతుల్లో 100 పరుగులు చేసి శ్రీలంక విజయం కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత మాథ్యూస్ 44, కరుణరత్నే 23 పరుగులతో రాణించారు. అజంతా మెండీస్ 9, పెరీరా 47 పరుగులతో అజేయంగా నిలిచి శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు. అఫ్ఘాన్ బౌలర్లలో హమీద్ హసన్ 3 వికెట్లు తీయగా, దవ్లత్ జాడ్రన్, షాపూర్ జాడ్రన్‌లు తలా ఓ వికెట్ తీశారు.

Ton-Up Jayawardene, Perera Help Sri Lanka Beat Afghanistan

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 49.4 ఓవర్లకు అలౌట్ అయి 232 పరుగులు చేసింది. అస్ఘర్ స్టానిక్జాయ్ 54, షెన్వారి 38, అష్రఫ్ 28, జావేద్ అహ్మది 24, మంగల్ 10, నబి 21, జాజయ్ 19 పరుగులతో రాణించారు.

శ్రీలంక బౌలింగ్‌లో మలింగ, మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా, లక్మల్ 2, పెరీరా, హెరాత్‌లు చెరో వికెట్ తీశారు. పసికూన అయిన ఆఫ్ఘన్ జట్టు చివరి వరకు గెలుపొందేందుకు పోరాటం చేసింది. ఒక దేశలో శ్రీలంక జట్టును ఓడిస్తుందా? అనే సందేహం కలిగింది. అనుభవం ఉన్న ఆటగాళ్లతో శ్రీలంక జట్టు విజయం సాధించగా, అంతగా అనుభవం లేని ఆప్ఘాన్ ఓటమిని చవిచూసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+