Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: రివెంజ్ అంటే ఇది.. మన్కడింగ్ చేయబోయాడని.. సింగిల్ హ్యాండ్‌తో ఓడించేశాడు!

 Tom Rogers destroys Melbourne Stars after escaping mankading

బిగ్ బ్యాష్ లీగ్‌లో మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. రెనగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అదిరిపోయే ముగింపు లభించింది. ఈ మ్యాచ్‌లో రెనగేడ్స్ కెప్టెన్ ఆడమ్ జంపాపై మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ రోజర్స్ పగ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా.. జంపా అతన్ని మన్కడింగ్ చేయబోయాడు. దీంతో చెలరేగిన అతను మెల్‌బోర్న్ స్టార్స్‌ను ఒంటి చేత్తో ఓడించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆడమ్ జంపా ముందుగా బౌలింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆడమ్ జంపా ముందుగా బౌలింగ్

ఎంచుకున్నాడు. అయితే రెనగేడ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ శామ్ హార్పర్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (32) రాణించగా.. షార్ మార్ష్ (32) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. జొనాథన్ వెల్స్ (24), మెకెంజీ హార్వీ (32) కూడా రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

మన్కడింగ్ చేయబోయిన జంపా

మన్కడింగ్ చేయబోయిన జంపా

ఈ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆడమ్ జంపా బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న టామ్ రోజర్స్ (1 నాటౌట్)ను మన్కడింగ్ చేయబోయాడు. ఆ ఓవర్ ఐదో బంతి వేయడానికి ముందుకొచ్చాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోజర్స్.. జంపా బంతి విసరక ముందే క్రీజు దాటేశాడు. దాంతో వెంటనే వెనక్కు తిరిగిన జంపా.. వికెట్లను కూల్చి అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అవుటై పోయానని భావించి వెళ్లిపోతున్న రోజర్స్‌ను అంపైర్లు ఆపారు. జంపా బంతి డెలివర్ చేయలేదు కానీ.. ఆ పొజిషన్‌కు వెళ్లే వరకు బ్యాటర్ క్రీజులోనే ఉన్నాడు. దాంతో అది నాటౌట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించాడు.

 చెలరేగిన రోజర్స్..

చెలరేగిన రోజర్స్..

దీన్ని కడుపులో పెట్టుకున్న రోజర్స్ తను బౌలింగ్ చేసే సమయంలో చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్ ఓపెనర్లు జో క్లార్క్ (0), టామ్ రోజర్స్ (1), బ్యూ వెబ్‌స్టర్ (8) ముగ్గుర్నీ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన హిల్టన్ కార్ట్‌రైట్ (20)ను కూడా అవుట్ చేశాడు. మెల్‌బోర్న్ స్టార్స్ జట్టులో నిక్ లార్కిన్ (48 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంతితో ఆ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన టామ్ రోజర్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

Story first published: Tuesday, January 3, 2023, 18:30 [IST]
Other articles published on Jan 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+