Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్ని స్థానాల్లో సూర్యకుమార్‌నే ఆడిస్తా.. మాజీ లెజెండ్ కామెంట్స్ వైరల్

Tom Moody will play Suryakumar Yadav in every position

ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. గతేడాది భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ స్టార్ బ్యాటర్ అప్పటి నుంచి ప్రపంచ క్రికెట్‌లో అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అదే సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ భారత్‌కు అనేక విజయాలను అందిస్తున్నాడు.

ప్రపంచకప్‌లో మూడు హాఫ్ సెంచరీలు

ప్రపంచకప్‌లో మూడు హాఫ్ సెంచరీలు

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ కీలకంగా మారుతాడని అతని ఫామ్ చూసిన వాళ్లు అంచనా వేశారు. అదే అంచనాను నిజం చేస్తున్న సూర్య.. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలపై హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. చివరగా జింబాబ్వేపై ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులతో అజేయంగా నిలిచాడు.

దిగ్గజాల నుంచి ప్రశంసలు

దిగ్గజాల నుంచి ప్రశంసలు

కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌కు దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. పాక్ లెజెండ్స్ వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి వాళ్లు కూడా సూర్యను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదన్నారు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆ దేశానికి చెందిన మాజీలు కూడా సూర్య సత్తా చూసి నోరెళ్లబెడుతున్నారు. అతన్ని ఎలాగైనా నిలువరించాలని, లేదంటే భారత్‌ను ఓడించడం కష్టమని అంటున్నారు.

ఆరుగుర్నీ ఆడిస్తా..

ఆరుగుర్నీ ఆడిస్తా..

ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ టామ్ మూడీ కూడా సూర్యకుమార్ ఆటతీరుకు ఫిదా అయిపోయాడు. రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న సూర్యను టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలా? అని అడిగిన ప్రశ్నకు మూడీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. 'అతను ఎక్కడైనా ఆడగలడు. మీ దగ్గర ఆరుగురు సూర్యకుమార్‌లు ఉంటే.. నేనైతే అందర్నీ జట్టులోకి తీసుకొని అన్ని స్థానాల్లో అతన్నే ఆడిస్తా. కానీ ప్రస్తుతం నాలుగో నెంబర్‌లో ఆడటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కదా. దాన్ని మార్చడం ఎందుకు?' అని మూడీ అడిగాడు.

Story first published: Tuesday, November 8, 2022, 15:29 [IST]
Other articles published on Nov 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+