Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs BAN:డ‌బుల్ సెంచ‌రీతో లాథ‌మ్ విశ్వ‌రూపం.. కుప్ప‌కూలిన బంగ్లాదేశ్‌

Tom Latham Double Hundred in Second Test Against Bangladesh

ఓవ‌ల్‌: న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథ‌మ్ బంగ్లాదేశ్‌తో జ‌ర‌గుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విశ్వ‌రూపం చూపించాడు. ఏకంగా భారీ డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. వ‌రుస బౌండ‌రీల‌తో బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం కివీస్ బౌల‌ర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ప‌ర్యాట‌క జ‌ట్టు బంగ్లాదేశ్ స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. దీంతో రెండో రోజు కూడా న్యూజిలాండ్ పూర్తి అధిప‌త్యాన్ని క‌న‌బ‌రిచింది.

లాథ‌మ్ డ‌బుల్ సెంచ‌రీ

లాథ‌మ్ డ‌బుల్ సెంచ‌రీ

349-1 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో న్యూజిలాండ్‌ నేడు ఉద‌యం ఆట ప్రారంభించింది. ఈ క్ర‌మంలో డేవాన్ కాన్వే త‌న టెస్టు కెరీర్‌లో మూడో సెంచ‌రీ పూర్తి చేశాడు. అయితో స్కోర్ 363 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 109 ప‌రుగులు చేసిన కాన్వేను హాస‌న్ ర‌నౌట్ చేశాడు. దీంతో లాథ‌మ్, కాన్వే నెలకొల్పిన‌ 215 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం కెరీర్‌లో చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడుతున్న రాస్ టేల‌ర్‌తో క‌లిసి లాథ‌మ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో లాథ‌మ్ త‌న కెరీర్‌లో రెండో డ‌బుల్ సెంచ‌రీ కూడా పూర్తి చేశాడు.

చివ‌రి మ్యాచ్‌లో టేల‌ర్ స్కోర్‌

చివ‌రి మ్యాచ్‌లో టేల‌ర్ స్కోర్‌

కెరీర్‌లో చివ‌రి సారి బ్యాటింగ్ చేస్తున్న రాస్ టేల‌ర్ బంగ్లా బౌల‌ర్ల‌ను సమ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాడు. ఓ ద‌శ‌లో మంచి స్కోర్ చేసేలాగే క‌నిపించాడు. కానీ జ‌ట్టు స్కోర్ 411 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 28 ప‌రుగులు చేసిన రాస్ టేల‌ర్‌ను హుస్సేన్‌ను ఔట్ చేశాడు. కెరీర్ చివ‌రి మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న టేల‌ర్ 4 ఫోర్ల‌తో 28 ప‌రుగులు సాధించాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన నికోల‌స్ ప‌రుగులేమి చేయ‌కుండానే హుస్సేన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ కాసేప‌టికే 3 ప‌రుగుల‌కే మిచెల్.. ఇస్లాం బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

లాథ‌మ్ 250

లాథ‌మ్ 250

వికెట్ కీప‌ర్ టామ్ బ్లండెల్‌తో క‌లిసి డ‌బుల్ సెంచ‌రీ హీరో టామ్ లాథ‌మ్ ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. ఈ క్ర‌మంలో బ్లండెల్ కెరీర్‌లో మూడో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. అలాగే లాథ‌మ్ కూడా 250 ప‌రుగుల మార్క్‌ను చేరాడు. అయితే జ‌ట్టు స్కోర్ 499 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 252 ప‌రుగులు చేసిన టామ్ లాథ‌మ్.. మోమినుల్ బౌలింగ్‌లో యాస‌ర్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మొత్తంగా 373 బంతులు ఎదుర్కొన్న లాథ‌మ్ 67 స్ట్రైక్‌రేట్‌తో 252 ప‌రుగులు చేశాడు. ఇందులో 34 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కాసేప‌టి త‌ర్వాత న్యూజిలాండ్ త‌మ స్కోర్‌ను 521-6 వ‌ద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌల‌ర్ల‌లో ఇస్లాం, హుస్సేన్ రెండేసి, మోమినుల్ ఒక వికెట్ తీశాడు.

కుప్ప కూలిన బంగ్లాదేశ్‌

కుప్ప కూలిన బంగ్లాదేశ్‌

కివీస్ బౌల‌ర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కివీస్ పేస‌ర్లు బోల్ట్‌, సౌథీ, జేమ్స‌న్ చెల‌రేగ‌డంతో బంగ్లా ఏ ద‌శ‌లోనూ మంచి స్కోర్ సాధించేలా క‌నిపించ‌లేదు. 27 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను యాసర్ అలీ(55), హ‌స‌న్(41) ఆదుకున్నారు. కెప్టెన్ మోమినుల్‌తోపాటు ఓపెన‌ర్ న‌యిమ్ డ‌కౌట్ అయ్యారు. బౌల్ట్ 5 వికెట్ల‌తో చెల‌రేగాడు. సౌథీ 3, జేమ్స‌న్ 2 వికెట్ల తీశాడు. మొత్తంగా రెండో రోజు ఆట‌లో 80 ఓవ‌ర్ల పాటు సాగింది. 298 ప‌రుగులు రాగా 15 వికెట్లు ప‌డ్డాయి. మొత్తంగా అయితే రెండో రోజు ఆట‌లో కూడా అతిథ్య న్యూజిలాండ్ పూర్తి అధిప‌త్యాన్ని క‌న‌బ‌రిచింది.

Story first published: Monday, January 10, 2022, 11:59 [IST]
Other articles published on Jan 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+