
ఓపెనర్లు శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగినప్పటికీ కివీస్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఆ జట్టు ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో లాథమ్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. అంతేకాకుండా తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా న్యూజిలాండ్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిండ్ స్కోర్ 92-0. క్రీజులో లాథమ్ 66 పరుగులతో, యంగ్ 26 పరుగులతో ఉన్నారు.

చెలరేగిన లాథమ్, యంగ్
లంచ్ బ్రేక్ తర్వాత ప్రారంభమైన సెకండ్ సెషన్‌లో కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ చెలరేగి ఆడారు. ఈ క్రమంలో విల్ యంగ్ తన టెస్టు కెరీర్‌లో ఐదో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే జట్టు స్కోర్ 148 పరుగుల వద్ద ఉండగా 5 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసిన విల్ యంగ్ ఇస్లాం బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అనంతరం డేవాన్ కాన్వేతో జత కట్టిన కెప్టెన్ లాథమ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 133 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో లాథమ్‌కు ఇది 12వ సెంచరీ. సెకండ్ సెషన్‌లో ఒక వికెట్ కోల్పోయి న్యూజిలాండ్ 110 పరుగులు రాబట్టింది. దీంతో టీ విరామ సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 202-1. క్రీజులో లాథమ్ 118, కాన్వే 28 పరుగులతో ఉన్నారు.
లాథమ్, కాన్వే దూకుడు
టీ బ్రేక్ తర్వాత మొదలైన మూడో సెషన్‌లో లాథమ్, కాన్వే దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో కాన్వే హాఫ్ సెంచరీ, లాథమ్ 150 పరుగులు చేసుకున్నాడు. కెరీర్‌లో కాన్వేకు ఇది మూడో హాఫ్ సెంచరీ. బంగ్లా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో వారు తేలి పోయారు. ఇద్దరు కలిసి ఈ సెషన్‌లో ఏకంగా 147 పరుగులు రాబట్టారు.
మూడో సెషన్‌లో లాథమ్ 68, కాన్వే 71 రాబట్టారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 348 పరుగులు చేసింది. క్రీజులో 186 పరుగులతో లాథమ్, 99 పరుగులతో కాన్వే ఉన్నాడు. దుమ్ములేపే ఆట తీరుతో డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న లాథమ్ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు ఉండగా.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న కాన్వే ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
లాథమ్, కాన్వే రెండో వికెట్‌కు అజేయంగా 201 పరుగులు జోడించడం విశేషం. బంగ్లా బౌలర్లలో ఇస్లాంకు ఒక వికెట్ దక్కింది. మొత్తంగా తొలి రోజు ఆట 90 ఓవర్ల పాటు సాగింది.


Click it and Unblock the Notifications












