For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ, రోహిత్‌లకు వీరాభిమానిని.. అయినా వాళ్లిద్దరి వికెట్లు తీస్తా'

Tom Curran says Kohli and Rohit are world class players, looking forward to play against them in IPL
IPL 2020: Tom Curran Eyes To Take Virat Kohli & Rohit Sharma's Wickets | Oneindia Telugu

లార్డ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మలకు వీరాభిమానిని అని ఇంగ్లాండ్‌ పేసర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో కోహ్లీ, రోహిత్‌లతో తలపడడానికి ఎదురు చూస్తున్నా. వీరాభిమానిని అయినా.. ఐపీఎల్‌లో వాళ్లిద్దరితో పోటీపడతా, వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తా అని అన్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కరన్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలుచేసింది. అంతమందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడాడు.

రోహిత్‌, కోహ్లీతో తలపడటం ఓ సవాలు

రోహిత్‌, కోహ్లీతో తలపడటం ఓ సవాలు

తాజాగా టామ్‌ కరన్‌ ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఒక బౌలర్‌గా వారిని కట్టడి చేసేందుకు నా ప్రణాళికలపై దృష్టి పెడతా. వాళ్లతో ఆడటం సవాలుతో కూడుకున్నది. అందుకోసం ఎదురు చూస్తున్నా. కోహ్లీ, రోహిత్‌లకు వీరాభిమాని. అయినా.. ఐపీఎల్‌లో వాళ్లిద్దరి వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తా' అని టామ్‌ అన్నాడు.

ప్రపంచకప్‌ గురించి ఆలోచించట్లేదు

ప్రపంచకప్‌ గురించి ఆలోచించట్లేదు

'ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో జట్టులో నా స్థానం గురించి ఆలోచించట్లేదు. ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. నేను ఆడే ఏ మ్యాచ్‌ అయినా.. నా ఎంపికపై ప్రభావం చూపుతుంది. ప్రతీమ్యాచ్‌లో పురోగతి చెందడమే నా లక్ష్యం. రాజస్థాన్‌ తరఫున స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ లాంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. రాజస్థాన్‌ రాయల్స్‌కు విజయాలు అందించాలనుకుంటున్నా' అని టామ్‌ తెలిపాడు.

20 వన్డేలు, 18 టీ20లు

20 వన్డేలు, 18 టీ20లు

టామ్‌ కరన్‌ ఇటీవల దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శన చేసాడు. టీ20 సిరీస్‌లోని రెండో గేమ్‌ను ఇంగ్లండ్‌ను 2 పరుగుల తేడాతో గెలవడానికి కరనే కారణం. టామ్‌ కరన్‌ ఇంగ్లండ్ తరఫున 2 టెస్టులు, 20 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2 వికెట్లు, వన్డేల్లో 27 వికెట్లు, టీ20ల్లో 21 వికెట్లు తీసాడు. 66, 198, 38 పరుగులు కూడా చేసాడు.

మార్చి 29న ఐపీఎల్ ప్రారంభం

మార్చి 29న ఐపీఎల్ ప్రారంభం

మార్చి 29వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో తొలి మ్యాచ్ జ‌రుగుతుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియ‌న్స్ తొలి మ్యాచ్ ఆడుతుంది. మే 24వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. మార్చి 29 నుంచి మే 17 వ‌ర‌కు లీగ్ ద‌శ ఉండగా.. నాకౌట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్నారు. చివరి లీగ్‌ మ్యాచ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది.

Story first published: Wednesday, February 26, 2020, 12:05 [IST]
Other articles published on Feb 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+