
ద్రవిడ్‌తో ప్రేమలో పడ్డా
ఓ టాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అనుష్క ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ అభిమాని.. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించగా, దీనికి అనుష్క ‘రాహుల్ ద్రవిడ్ నా అభిమాన క్రికెటర్. నా చిన్నతనం నుంచి అతనంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో ప్రేమలో పడ్డా' అని చెప్పుకొచ్చింది.

అండర్-19, భారత్-ఏ జట్లకు కోచ్‌గా
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ అండర్-19, భారత్-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహారిస్తున్నారు. ఇక అనుష్క విషయానికి వస్తే ప్రస్తుతం భాగమతి అనే సినిమాలో నటిస్తోంది. 'బాహుబలి 2' తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం 'భాగమతి'. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా అనుమానాలున్నాయి.

అనుష్క పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదల
'భాగమతి' టైటిల్ విన్న చాలా మంది ఇది హైదరాబాద్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అని భావించారు. ఇటీవల అనుష్క పుట్టినరోజున ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదని తేలిపోయింది. ఇక, ‘భాగమతి' సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుందనే విషయంలో నిజం లేదని, ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని దర్శకుడు అశోక్ తెలిపారు.

తెలుగు, తమిళం, మళయాల భాషల్లో ఒకేసారి
యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మళయాల భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











