Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవేర్‌నేస్ ప్రోగ్రామ్‌.. విరాట్ కోహ్లీతో జూనియర్ ఎన్టీఆర్

Jr NTR To Collaborate With Virat Kohli || Oneindia Telugu
Tollywood Hero Jr NTR joins hand with indian Captain Virat Kohli on Road and Alcohol Awareness Program by NDTV

ఒకరు సినీ రంగంలో, మరొకరు క్రికెట్ రంగంలో ఓ వెలుగువెలుగుతున్నారు. ఇద్దరికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ ఇద్దరు కలిసి మరికొద్ది రోజుల్లో తెరను పంచుకోనున్నారు. ఆ ఇద్దరే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ 'యంగ్ టైగర్' ఎన్టీఆర్. ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీ తయారు చేయనున్న ఓ అవేర్‌నేస్ ప్రోగ్రామ్‌లో కోహ్లీ, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఎన్డీటీవీ అవేర్‌నేస్ ప్రోగ్రామ్‌:

ఎన్డీటీవీ అవేర్‌నేస్ ప్రోగ్రామ్‌:

ప్రతి రోజు మ‌ద్యం సేవించి వాహ‌నాలు నడిపే వారి సంఖ్య ఎక్కువైంది. మద్యం మత్తులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా.. ఏ మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను కల్పించేందుకు ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ఒకే వేదికపై కోహ్లీ, ఎన్టీఆర్:

ఒకే వేదికపై కోహ్లీ, ఎన్టీఆర్:

ఈ కార్య్రక్రమంలో భాగంగా విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్ చేతులు కలపనున్నారు. వీరితో పాటు పలు రంగాల్లోని మరో ఏడుగురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారని సమాచారం తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడనుంది. సెల‌బ్రిటీలు అందరూ మ‌ద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గాను తమ వంతు సహకారం అందించనున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ అవగాహన:

ఇప్పటికే ఎన్టీఆర్ అవగాహన:

కోహ్లీ, ఎన్టీఆర్ ప్రజా శ్రేయస్సు కోరుతూ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ లో పాల్గొనడం అభినందించదగ్గ విషయం. భారీ ఫాలోయింగ్ ఉన్న కోహ్లీ, తారక్ లాంటి వారు సూచనలు ఇస్తే ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాడు. త‌న ప్ర‌తీ సినిమా ప్రారంభానికి ముందు వాయిస్ ఓవ‌ర్ రూపంలో తారక్‌ ఓ మెసేజ్ ఇస్తాడు. ప్రతి సినిమా ఈవెంట్లో కూడా తన అభిమానులను క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాడు.

ప్రపంచకప్‌లో కోహ్లీ:

ప్రపంచకప్‌లో కోహ్లీ:

అరవింద సమేత' లాంటి మంచి హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో 'మెగా పవర్ స్టార్' రాంచరణ్ కూడా మరో హీరో. మరోవైపు ప్రపంచకప్‌ టోర్నీలో విరాట్ కోహ్లీ బిజీగా ఉన్నాడు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ శనివారం ఆఫ్ఘ‌నిస్తాన్‌తో ఆడనుంది.

Story first published: Friday, June 21, 2019, 11:14 [IST]
Other articles published on Jun 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+