For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్‌తో టాలీవుడ్ కమేడియన్ ధన్‌రాజ్: ఎక్కడ దొరకబట్టిండో..

Tollywood comedian Dhanraj took a selfie with Chris Gayle

లండన్: టాలీవుడ్ టాప్ కమేడియన్ ధన్‌రాజ్. పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. అనూష్క నటించిన భాగమతి రీమేక్ మూవీ దుర్గామతిలో ఒరిజినల్ వెర్షన్‌లో నటించిన పాత్రను పోషించారు. భూమి పెడ్నేకర్ టైటిల్ క్యారక్టర్‌లో నటించిన మూవీ అది. ఫర్వాలేదనిపించుకుంది. ఇందులో కానిస్టేబుల్ నంద్ సింగ్‌గా కనిపించారు. కేరీర్ ప్రారంభంలోనే ఓ తమిళ సినిమాలోనూ మెరిశారు. టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాల్లో నటించారు.

బుల్లితెరపైనా నవ్వులు పండించాడీ కమేడియన్. జబర్దస్త్‌ వంటి షోలు చేశారు. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్‌ కూడా. 41 రోజుల పాటు ఆయన బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగారు. అప్పటి సీజన్‌లో పదో స్థానంలో నిలిచారు. జీ తెలుగులో అదిరింది పేరుతో నిర్వహించిన కామెడీ షోలో నవ్వులు పూయించారు. తాజాగా ధన్‌రాజ్.. వార్తల్లోకెక్కారు. కరేబియన్ క్రికెట్ వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో సెల్ఫీ దిగారు ధన్‌రాజ్. ఈ ఫొటోను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

బ్లూ జీన్స్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్, అదే రంగు క్యాప్ ధరించి కనిపించిన క్రిస్ గేల్‌ను ఎక్కడ కలిశాడో వివరించలేదు ధన్‌రాజ్. వాషింగ్టన్ డీసీ కనెక్టికట్‌లో ఉన్న మేఫ్లవర్ హోటల్‌ లాంజ్‌లో ధన్‌రాజ్.. ఈ యూనివర్సల్ బాస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. క్రిస్ గేల్‌ను కలిశాననే ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ ఫొటో పోస్ట్ చేసిన వెంటనే పలువురు నెటిజన్లు స్పందించారు. ఎక్కడ కలిశావు బ్రో అంటూ ఆరా తీసే ప్రయత్నం చేస్తోన్నారు.

వెస్టిండీస్ బ్యాటింగ్ సునామీ క్రిస్ గేల్.. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో అందుబాటులో లేడు. మెగా వేలంపాటలో కూడా పాల్గొనలేదు. తన పేరును రిజిస్టర్ కూడా చేయించుకోలేదు. ఫిట్‌నెస్ కారణాల వల్లే ఈ సారి అతను ఈ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తరువాత ఫిట్‌నెస్‌పై దృష్టి సారంచాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడాడు క్రిస్ గేల్. 4,965 పరుగులు చేశాడు.

అతని హయ్యెస్ట్ స్కోర్ 175 పరుగులు. తన ఐపీఎల్ కేరీర్‌లో మొత్తం ఆరు సెంచరీలు చేశాడు. 31 అర్ధసెంచరీలు బాదాడు. బ్యాటింగ్ యావరేజ్ 39.72. 148.96 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ కొనసాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధికంగా 91 మ్యాచ్‌లు ఆడాడు. 3,420 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ హయ్యెస్ట్ వ్యక్తిగత బ్యాటింగ్ స్కోర్ 175 పరుగులు చేసింది కూడా ఆర్సీబీ తరఫునే.

Story first published: Saturday, July 2, 2022, 14:38 [IST]
Other articles published on Jul 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+