స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. త్వరలోనే టాలీవుడ్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా వార్నర్‌ను ఓ టాలీవుడ్ స్టార్.. స్టేజ్ పైనే దొంగముండా కొడకు అంటూ బూతులు తిట్టారు. దీంతో క్రికెట్ అభిమానులు ఆ నటుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందదంటే?
టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల.. హీరో నితిన్‌తో కలిసి రాబిన్‌హుడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న మూవీ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను మూవీటీమ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తన దేశం నుంచి వార్నర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. అయితే ఈ ఈవెంట్ కు సినిమాలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే స్టేజ్ పై ఎక్కి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. "వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడిని క్రికెట్ ఆడమంటే.. పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ముండా కొడుకు.. రేయ్ వార్నర్. ఇదే నా వార్నింగ్." అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు.

ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ తీవ్ర చర్చనయాంశంగా మారాయి. క్రికెట్ అభిమానులు.. రాజేంద్రప్రసాద్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ కు తెలుగు రాదు కాబట్టి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు, అలా అనడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.