పొదుపు మంత్రం: టోక్యో ఒలింపిక్స్‌కు కాస్ట్ కటింగ్
హైదరాబాద్: జపాన్ ఆతిథ్యమిస్తున్న 2020 ఒలింపిక్స్‌లో నిర్వాహకులు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే టోక్యో నగరం వేదికగా జరగనున్న 2020 ఒలింపిక్స్ బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించారు.
టోక్యో ఒలింపిక్స్ కోసం నిజానికి 2 లక్షల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయిస్తారని అందరూ భావించారు. అయితే అందులో సగానికి సగం కోత విధించారు.

ఆర్థికవేత్తలు హెచ్చరికలు
గత నెలలో 17.78 బిలియన్ డాలర్లు (రూ.లక్షా 20 వేల కోట్లు)గా ఉన్న ఈ బడ్జెట్ అంచనాను 17 బిలియన్ల (రూ. లక్షా 15 వేల కోట్లు)కు కుదించారు. ఒలింపిక్ బడ్జెట్‌ను ఇప్పటినుంచే నియంత్రించకపోతే 30 బిలియన్ల (రూ. 2 లక్షల కోట్లు)కు పెరిగిపోతుందని గత నెలలో ఆర్థికవేత్తలు హెచ్చరించారు.

అంచనా వ్యయాన్ని భారీగా తగ్గించారు
ఈ నేపథ్యంలో ఒలింపిక్ నిర్వాహకులు అంచనా వ్యయాన్ని తగ్గించారు. తొలుత 30 బిలియన్ల అమెరికన్ డాలర్లు కేటాయించాలని భావించినా చివరకు అది 15-16.0 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఒలింపిక్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిరో మూటో తెలిపారు.

1.6-1.8 ట్రిలియన్ జపాన్ యెన్‌లు
అంటే ప్రస్తుతం డాలర్ మారకపు విలువతో పోలిస్తే 1.6-1.8 ట్రిలియన్ జపాన్ యెన్‌లు. అదే రూపాయల్లో మారిస్తే సుమారు లక్ష కోట్లు. టోక్యో ఒలింపిక్స్‌లో స్టేడియాల నిర్మాణాలను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రియో ఒలింపిక్స్ కోసం 12 బిలియన్లు
ఈ ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్ కోసం 12 బిలియన్లు (రూ. 81, 600 కోట్లు) ఖర్చు చేస్తే, నాలుగేళ్ల క్రితం ముగిసిన లండన్ ఒలింపిక్స్ కోసం 13.7 బిలియన్లు (రూ. 93 వేల కోట్లు) ఖర్చు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications