Tokyo Olympics 2021:ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..విరాట్ కోహ్లీని ఆడేసుకుంటున్న ఫ్యాన్స్‌!ఎంత తీసుకున్నాడో అంటూ!

హైదరాబాద్: తనదైన ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. అత్యధిక ఇన్‌స్టా ఫాలోయర్లు కలిగిన క్రికెటర్‌గా ఇప్పటికే కోహ్లీ ఓ రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కోహ్లీ.. తనకు, క్రికెట్ ఆటకు సంబందించిన పోస్టులు పెడుతుంటాడు. కోహ్లీ ఏ పోస్ట్ చేసినా దానికి ఓ విలువ ఉంటుంది. ఆర్థికంగా ఈ పోస్టులు విరాట్‌కు కోట్లు కురిపించేవి కాగా.. త‌న‌ను ఫాలో అయ్యే ఎంతో మంది అభిమానుల్లో అవి ఆస‌క్తి రేపుతాయి. అలాంటి ప్లేయ‌ర్ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ 2020 జరుగుతున్న విషయం తెలిసిందే. విశ్వ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 120 మంది భారత అథ్లెట్లు వెళ్లారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఇండియ‌న్ అథ్లెట్లు మ‌న్‌ప్రీత్ సింగ్‌, నీర‌జ్ చోప్రా, నిషాద్ కుమార్‌, అమోజ్ జాక‌బ్‌, మ‌ణ్‌దీప్ సింగ్‌, భ‌జ‌రంగ్ పూనియా, వ‌రుణ్ కుమార్‌లు లవ్లీ ప్రొఫెష‌న‌ల్ యూనివ‌ర్సిటీ (ఎల్‌పీయూ) నుంచి వ‌చ్చిన వాళ్లే. వీరందరూ ఎల్‌పీయూలో చదివారు. వీళ్ల‌ను ఉద్దేశించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.

కోహ్లీ ఎంత తీసుకున్నాడో

కోహ్లీ ఎంత తీసుకున్నాడో

'అద్భుత రికార్డ్‌. 10 శాతం మంది ఇండియ‌న్ ఒలింపియ‌న్లు లవ్లీ ప్రొఫెష‌న‌ల్ యూనివ‌ర్సిటీ (ఎల్‌పీయూ) నుంచి వ‌చ్చిన వాళ్లే. ఈ ఎల్‌పీయూ ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు కూడా త‌న స్టూడెంట్స్‌ను పంపిస్తుంద‌ని భావిస్తున్నా' అని విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త కాస్త వైరల్ అయింది. ఇది చూసి ఫాన్స్, అభిమానులు కోహ్లీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఇలాంటి పోస్ట్ చేయ‌డ‌మేంట‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు. అయితే విరాట్ చేసిన ఈ కామెంట్ ప్ర‌మోష‌న‌ల్ పోస్ట్‌లాగా క‌నిపిస్తున్నా.. అదేదో పెయిడ్ పార్ట్‌న‌ర్‌షిప్ అని చెప్పొచ్చు క‌దా అని కూడా కొంద‌రు అంటున్నారు. ఇది బిజినెస్ అని, ప్రమోషన్ కోసం కోహ్లీ ఎంత తీసుకున్నాడో అని కూడా ఇంకో వర్గం అంటోంది.

Mirabai Chanu: మీరాకు మరో బంపర్ ఆఫర్! అప్పుడు పిజ్జాలు.. ఇప్పుడు మూవీ టికెట్లు!!

12వ తరగతి వరకే

12వ తరగతి వరకే

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 2008లో టీమిండియా తరఫున విరాట్ అరంగేట్రం చేశాడు. 2008 అండర్ 19 కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. అదే ఏడాది టీమిండియాలోకి వచ్చాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే 2011 వన్డే ప్రపంచకప్ ఆడాడు. ఆపై స్టార్ ఆటగాడిగా ఎదిగాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడడంతో.. కోహ్లీకి ఉన్నత చదువులు చదివే అవకాశమే లేకుండా పోయింది. ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించాడు.

70 సెంచరీలు. 22 వేల పరుగులు

70 సెంచరీలు. 22 వేల పరుగులు

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 92 టెస్టులాడి 52.00 సగటుతో 7547 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు) 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేల పరుగులు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 29, 2021, 15:23 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X