
రాహుల్‌తో తొలి దెబ్బ..
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత ఓపెనర్లలో ఒకరినైనా పెవిలియన్ చేర్చాలని ఆస్ట్రేలియా అనుకుంది. కానీ ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్ మాత్రం దక్కలేదు. కేఎల్ రాహుల్ టెస్టు ఇన్నింగ్స్ ఆడగా.. రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే మరో ఏడు బంతుల్లో ఆట ముగుస్తుందనగా.. ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తమ జట్టుకు కావలసిన బ్రేక్ ఇచ్చాడు. అతని బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ చేరాడు.
పుజీ, అశ్విన్ కూడా..
రెండో రోజు ఆట మొదలైన తర్వాత నైట్ వాచ్‌మెన్ అశ్విన్ (23) కూడా చక్కగా ఆడాడు. రోహిత్, అశ్విన్ ఇద్దరూ రిస్క్ తీసుకోకుండా ఆడటంతో మొదటి సెషన్‌లో భారత్‌దే పైచేయి అయ్యేలా కనిపించింది. కానీ మరోసారి మర్ఫీ తన మాయ చేశాడు. నిలకడగా ఆడుతున్న అశ్విన్‌ను అవుట్ చేశాడు. దీంతో ఆసీస్ జట్టు చాలా సంతోషించింది. అయితే మర్ఫీ అక్కడితో ఆగలేదు. అశ్విన్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారాను కూడా బుట్టలో వేసుకున్నాడు.

మూడు వికెట్లు అతనికే..
క్రీజులోకి వచ్చిన తర్వాత కొంత వేగంగా ఆడేందుకు పుజారా ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మర్ఫీని సమర్ధవంతంగా ఎదుర్కున్నట్లే కనిపించాడు. కానీ ఆ జోరును పూర్తిగా కొనసాగించలేకపోయాడు. మర్ఫీ వేసిన బంతిని స్వీప్ చేయబోయి విఫలమయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బోలాండ్ దీన్ని సులభంగా అందుకున్నాడు. దీంతో ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా పెవిలియన్ చేరాడు.

విమర్శకుల నోళ్లకు తాళం..
ఇదంతా చూసిన ఆస్ట్రేలియా అభిమానులు, నిపుణులు మర్ఫీని తెగ మెచ్చుకుంటున్నారు. అతనే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు తిప్పే బాధ్యత అతనిపైనే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు మంచి టైట్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్న అతనిపై ఈ ఇన్నింగ్స్‌తో అంచనాలు పెరుగుతాయని చెప్తున్నారు. అంతగా అనుభవం లేని మర్ఫీని చాలా వేగంగా ఆసీస్ జాతీయ జట్టులోకి తీసుకోవడాన్ని కొందరు విమర్శించారు. ఇప్పుడు అతని ప్రదర్శన చూసి వాళ్లంతా నోరెళ్లబెట్టారని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications
