Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LKN vs SRH Dream 11 అంచనాలు: సన్‌రైజర్స్‌కు సత్తాకు సవాల్

కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో భాగంగా ఇవ్వాళ లక్నో సూపర్ జెయింట్స్- సన్‌‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. లక్నో జెయింట్స్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా.. సన్‌రైజర్స్‌కు రెండోది. ఈ రెండు జట్లు కూడా ఇదివరకు మ్యాచ్‌లో ఓటమి చవి చూసినవే. తాను ఆడిన రెండో మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. సన్‌రైజర్స్ ఇంకా ఖాతా తెరవలేదు.

ఈ సాయంత్రం 7:30 గంటలకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ పేసర్ మొహసిన్ ఖాన్ గాయాల బారిన పడ్డాడు. తుదిజట్టులో అతనికి చోటు దక్కే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో డికాక్ ఆడొచ్చు.

lsgvssrhtataipl2023

డికాక్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే మార్కస్ స్టొయినిస్‌ను తప్పించే అవకాశం ఉంది. ఓపెనర్ కైలే మేయర్స్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసిన నేపథ్యంలో అతణ్ని పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్. ఆల్ రౌండర్ కేటగిరీలో స్టొయినిస్‌ను కొనసాగించదలచుకుంటే టాప్ ఆర్డర్‌ బ్యాటర్ దీపక్ హుడా తుదిజట్టులో చోటు కోల్పోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

లోయర్ ఆర్డర్‌లో నికొలస్ పూరన్, ఆయుష్ బదోని రాణిస్తోన్నందున వారిలో ఒకరిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసే అవకాశాలు లేకపోలేదు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్క్ వుడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ కీలకంగా ఉంటారని భావిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికీ.. ప్లేయర్ల నిలకడలేమి లక్నో జెయింట్స్‌ను వేధిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌కు అతనే సారథ్యాన్ని వహించే అవకాశం ఉంది. గాయాలు పెద్దగా బాధించట్లేదు. టాప్ ఆర్డర్‌లో మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్ కీలకంగా మారారు. మార్క్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. నెదర్లాండ్స్‌పై వన్డేలో 175 పరుగులు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన తొలి మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, అభిషేక్ వర్మ విఫలం అయ్యారు. ఈ మ్యాచ్‌లో వారు ఎలా రాణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అబ్దుల్ సమద్ ధాటిగా ఆడిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ ఆ మ్యాచ్‌లో రాణించలేదు.

బౌలర్లలో టీ నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ వికెట్ లెస్. ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంటుంది. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ తన దూకుడును ప్రదర్శిస్తోన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై అతను తీసుకున్న వికెట్.. మ్యాచ్‌కే హైలైట్ గా నిలిచింది.

డ్రీమ్ 11 అంచనాల్లో- వికెట్ కీపర్లుగా క్వింటన్ డికాక్, నికొలస్ పూరన్ మొదటి స్థానాన్ని ఆక్రమించారు. బ్యాటింగ్ విభాగంలో మయాంక్ అగర్వాల్, సమద్‌కు చోటు కల్పంచవచ్చు. ఆల్ రౌండర్ కేటగిరీలో ఎయిడెన్ మార్క్‌రమ్, మార్కస్ స్టోయినిస్, కైలే మేయర్స్‌ ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉమ్రాన్ మాలిక్, మార్క్‌వుడ్, ఖాన్, రవి బిష్ణోయ్‌లను తీసుకోవచ్చు.

Story first published: Friday, April 7, 2023, 9:47 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+