Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ vs జేసన్ రాయ్: డ్రీమ్‌ టీమ్‌ ఇదే

బెంగళూరు: ఐపీఎల్ 2023లో ఇవ్వాళ మరో ఆసక్తికరమైన మ్యాచ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కత నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇది 36వ మ్యాచ్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్, కోల్‌కత నైట్ రైడర్స్‌కు నితీష్ రాణా కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు.

కేకేఆర్ కంటే చాలా మెరుగ్గా ఉంది ఆర్సీబీ. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాల ముంగిట్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- వరుసగా మూడింట్లో విజయం సాధించినట్టవుతుంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఏడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. ఆర్సీబీ నాలుగింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉంది. నైట్ రైడర్స్ ఖాతాలో ఉన్నవి రెండు విజయాలే.

RCB vs KKR: Dream 11 prediction and Fantasy top picks

పాయింట్ల పట్టికలో ఈ టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. వరుసగా రెండో విజయాలతో దూకుడు మీద ఉన్న రాయల్ ఛాలెంజర్స్‌ను ధీటుగా ఎదుర్కొనడానికి కసరత్తు పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో ఘోరంగా ఓడింది కేకేఆర్. ఈ మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైతే కోలుకోవడం దాదాపుగా అసాధ్యమే అవుతుంది.

ఆర్సీబీ తుదిజట్టులో- ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రార్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనీందు హసరంగా, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. కేకేఆర్‌లో- నారాయణ్ జగదీషన్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కేప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వీస్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, వరుణ చక్రవర్తి ఆడొచ్చు.

డ్రీమ్ 11లో టాప్ పిక్స్‌లో బ్యాటర్లుగా- విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, జేసన్ రాయ్, ఆల్ రౌండర్స్ కేటగిరీలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, వనిందు హసరంగ, శార్దుల్ ఠాకూర్, వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మహ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించవచ్చు.

Story first published: Wednesday, April 26, 2023, 8:20 [IST]
Other articles published on Apr 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+