Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs SRH: కావ్యా పాప డ్రీమ్ టీమ్

కోల్‌కత: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- కోల్‌కత నైట్‌ రైడర్స్ తలపడనున్నాయి. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎయిడెన్ మార్క్‌రమ్, నైట్‌రైడర్స్‌కు నితీష్ రాణా కేప్టెన్లుగా వ్యవహరించనున్నారు. సన్‌రైజర్స్ కంటే మెరుగైన స్థానంలో ఉంది కేకేఆర్.

ఇప్పటివరకు ఈ రెండు జట్లు మూడేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. కేకేఆర్ రెండింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఖాతాలో ఉన్నది ఒక్క గెలుపే. టేబుల్‌లో ఈ టీమ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది ప్రస్తుతానికి. బలమైన కేకేఆర్‌ టీమ్‌ను ఎదుర్కొనడానికి సన్‌రైజర్స్.. జట్టులో పెద్దగా మార్పులేవీ చేయకపోవచ్చు. పంజాబ్ కింగ్స్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించినందున అదే జట్టును దింపే అవకాశం ఉంది.

KKR vs SRH Playing 11

నాలుగు వికెట్లతో సత్తా చాటిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, రాహుల్‌ త్రిపాఠి ఈ మ్యాచ్‌లో కూడా విజృంభించాలని కోరుకుంటోంది సన్‌రైజర్స్. హ్యారీ బ్రూక్ విఫలం కావడం నిరాశ పరిచే అంశమే. ఒకరిద్దరు బ్యాటర్లు తప్ప- జట్టులో అందరూ రాణిస్తోన్న నేపథ్యంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కోల్‌కత నైట్ రైడర్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది.

వరుసగా రెండు విజయాలతో కేకేఆర్ జోరు మీద ఉంది. రింకూ సింగ్ తన బ్యాటింగ్ మాయాజాలంతో గుజరాత్ టైటాన్స్‌పై జట్టను గెలిపించాడు. చివరి అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు కొట్టిన విషయాన్ని ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. సన్‌రైజర్స్ బౌలర్లపై అతను విరుచుకపడే అవకాశం లేకపోలేదు. ఈ సీజన్‌లో విఫలమౌతూ వస్తోన్న వెంకటేష్ అయ్యర్‌ను మళ్లీ బెంచ్‌పై కొనసాగవచ్చు.

గోల్డెన్ డక్స్ సాధించిన ఆండ్రీ రస్సెల్స్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ జట్టుకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అతణ్ని ఇవ్వాళ్టి మ్యాచ్‌లో ఆడిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. శార్దుల్ ఠాకూర్ సైతం భారీ షాట్లను ఆడుతున్నాడు. ఆల్ రౌండర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. నితీష్ రాణా, రింకూ సింగ్, ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ క్రీజ్‌లో కుదురుకుంటే సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపగలరు.

కేకేఆర్ తుదిజట్టులో- రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్ జగదీశన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కేప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి ఆడొచ్చు. సన్‌రైజర్స్‌లో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కేప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్‌ను తీసుకోవచ్చు.

కోల్‌కత నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో- మన్‌దీప్ సింగ్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, అనుకూల్ రాయ్, లోకీ ఫెర్గూసన్, సన్‌రైజర్స్‌లో మార్కో జె‌న్‌సెన్, మయాంక్ డాగర్, ఉపేంద్ర యాదవ్, అన్‌మోల్‌ ప్రీత్ సింగ్, ఆదిల్ రషీద్‌ను తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

Story first published: Friday, April 14, 2023, 8:48 [IST]
Other articles published on Apr 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+