Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గండం- గట్టెక్కేనా: డ్రీమ్‌ టీమ్‌ ఇదే

కోల్‌కత: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇది 29వ మ్యాచ్. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎయిడెన్ మార్క్‌రమ్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు.

సన్‌రైజర్స్ కంటే చాలా మెరుగ్గా ఉంది సీఎస్‌కే. ఇప్పటివరకు ఈ రెండు జట్లు అయిదేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. సీఎస్‌కే మూడింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఖాతాలో ఉన్నవి రెండు విజయాలే. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. బలమైన సీఎస్‌కేను ఎదుర్కొనడానికి సన్‌రైజర్స్ కసరత్తు పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తోంది.

CSK vs SRH Dream11 Prediction: Fantasy Cricket tips and Player stats

తుదిజట్టులో- మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్/ ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, మార్కో జెన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ సహా మార్క్‌రమ్ మరోసారి విజృంభించాలని కోరుకుంటోన్నారు ఫ్యాన్స్.

చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయింగ్ 11లో- రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కేప్టెన్-వికెట్ కీపర్), మతీషా పాతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే ఆడే అవకాశాలు ఉన్నాయి.

డ్రీమ్ 11లో టాప్ పిక్స్‌లో హ్యారీ బ్రూక్‌కు నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో 138 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. బ్యాటింగ్ యావరేజ్ 27.60. ఆల్ రౌండర్లల్లో ఎయిడెన్ మార్క్‌రమ్‌‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో 109 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉంటోన్నాడు. బౌలర్లల్లో సీఎస్‌కే తురుఫుముక్క తుషార్ దేశ్‌పాండే మంచి ఛాయిస్. అయిదు మ్యాచ్‌లల్లో 10 వికెట్లు తీశాడు.

డ్రీమ్ టీమ్ 11లో బ్యాటర్లుగా- మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కేప్టెన్), ఆల్‌రౌండర్ల కేటగిరీలో రవీంద్ర జడేజా (కేప్టెన్), మొయిన్ అలీ, ఎయిడెన్ మార్క్‌రమ్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో టీ నటరాజన్, మయాంక్ మార్కండే, మహేశ్ తీక్షణకు అవకాశం కల్పించవచ్చు. ధోనీతో పోల్చుకుంటే ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే వికెట్ కీపర్‌గా గుడ్ ఛాయిస్.

Story first published: Friday, April 21, 2023, 7:35 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+