6, 6, 6, 6, 6, 6... 6 బంతుల్లో 6 సిక్సర్లు!
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మెట్రో బ్యాంక్ వన్ డే కప్‌లో హాంప్‌షైర్ బ్యాటర్ టోబీ ఆల్బర్ట్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. టోబీ ఆల్బర్ట్ బ్యాట్‌తో విరుచుకుపడి బౌలర్లను కూడా నివ్వెరపరిచాడు. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టోబీ ఆల్బర్ట్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తిగా హాంప్‌షైర్ వైపు తిప్పేశాడు.
రెండు వేర్వేరు ఓవర్లలో వరుసగా 6 సిక్సర్లు
క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం హెర్షెల్ గిబ్స్ (2007 వన్డే ప్రపంచ కప్), యువరాజ్ సింగ్(2007 టీ20 ప్రపంచ కప్) వంటి దిగ్గజాలకు సాధ్యమైంది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ అయిన టోబీ ఆల్బర్ట్ ఈ ఘనతను కాస్త భిన్నమైన రీతిలో సాధించాడు. ఒకే ఓవర్లో కాకుండా రెండు వేర్వేరు ఓవర్లలో తాను ఎదుర్కొన్న వరుస 6 బంతుల్లో 6 భారీ సిక్సర్లు బాది సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ సమయంలో మొదట నాంటెస్ట్ ఊస్ట్‌హుయిజెన్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులను టోబీ ఆల్బర్ట్ సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత ఓవర్లో బ్యాటర్ జేక్ లెమాన్ మొదటి రెండు బంతులను ఎదుర్కొనగా.. ఆ సమయంలో టోబీ ఆల్బర్ట్ నాన్-స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నాడు. మూడో బంతికి స్ట్రైక్ అందుకున్న ఆల్బర్ట్.. ఓలీ కిర్ట్లీ వేసిన తర్వాతి నాలుగు బంతులను ప్రేక్షకుల వైపు మళ్లి తరలించి.. మొత్తం వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు.
37 బంతుల్లోనే 86 పరుగులు
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఆల్బర్ట్‌కు 21 పరుగుల వద్ద లైఫ్ లభించింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆల్బర్ట్ కేవలం 37 బంతుల్లోనే 86 పరుగులు బాదాడు. ఆల్బర్ట్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్బర్ట్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా హాంప్‌షైర్ తమ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 383 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అలీ ఓర్ (105), 18 ఏళ్ల బెన్ మేస్ (109) ఇద్దరూ సెంచరీలు సాధించడంతో ఆ జట్టుకు బలమైన ఆరంభం లభించింది.
ససెక్స్ 332 పరుగులకే ఆలౌట్
384 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ససెక్స్ తమ శాయశక్తులా ప్రయత్నించింది. చార్లీ టియర్ కేవలం 94 బంతుల్లోనే 111 పరుగులతో అద్భుతమైన శతకం సాధించాడు. జాక్ లీనింగ్ (92), డాన్ ఇబ్రహీం (55) కూడా జట్టును మ్యాచ్‌లో నిలబెట్టేందుకు ప్రయత్నించారు, కానీ భారీ స్కోరు ఒత్తిడి చివరికి వారిపై ప్రభావం చూపింది. ససెక్స్ 332 పరుగులకే ఆలౌట్ కాగా, హాంప్‌షైర్ 51 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

