విశాఖపట్నం: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం విశాఖపట్నంపై తన ప్రేమను వ్యక్తం చేశాడు భారత వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తనకు విశాఖ నగరం ఎంతో నచ్చిందని పేర్కొన్నాడు.

'వైజాగ్ నుంచి తిరిగి వెళుతున్నా. నేను నివసించడానికి ఇష్టపడే నగరాల్లో ఇదొకటి. బీచ్‌తో పాటు అందమైన, ఆకట్టుకునే పచ్చదనం. నా మొదటి భారీ ఇన్నింగ్స్‌కు వేదిక కూడా' అని ధోనీ ట్వీట్ చేశాడు.
2005, ఏప్రిల్ 5న పాకిస్థాన్‌పై ఇక్కడ చేసిన తొలి సెంచరీ (148)తోనే హార్డ్ హిట్టర్‌గా ధోనీ పవర్ ప్రపంచానికి తెలిసింది. కాగా, తాజాగా శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి ట్వంటీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే