మెల్బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్‌లో భారత్ పరాజయం పొందింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 233 పరుగులకు ఆలౌటైంది. సెమీ ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో.. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ దారుణంగా ఓడిపోయిందని, ఆస్ట్రేలియా ధాటికి చేతులెత్తేసిందని చాలామంది మండిపడ్డారు. టోర్నీ మొత్తంలో బాగా ఆడినప్పటికీ.. ఆస్ట్రేలియాను తట్టుకోలేకపోయారని విమర్శించారు. క్రీడావిశ్లేషకులు మాత్రం భారత్ బాగానే ఆడిందని, పోరాడి ఓడిందని చెప్పారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిజంగానే మరీ చెత్తగా ఆడిందా అంటే.. అందుకు కాదనే చెప్పవచ్చు. ఈ టోర్నమెంటులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌తో పాటు తమ బౌలింగ్ సత్తా చూపించింది. ఆస్ట్రేలియా పైన భారత్ 233 పరుగులు చేసింది. ఈ టోర్నమెంటులో ఆసిస్ పైన అత్యధిక స్కోర్ చేసిన జట్లలో మనది రెండోది.
ఆసిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ జట్టు ఎలా పరుగులు చేసింది....

శ్రీలంక 46.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసిస్ 64 పరుగుల తేడాతో గెలిచింది.
భారత్ 46.5 ఓవర్లలో 233 పరుగులు చేసింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసిస్ 95 పరుగుల తేడాతో గెలిచింది.
ఇంగ్లాండ్ 41.5 ఓవర్లలో 231 పరుగులు చేసింది. మెల్బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసిస్ 111 పరుగుల తేడాతో గెలిచింది.
పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 213 పరగులు చేసింది. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది.
మెల్బోర్న్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ 23.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు 152 పరుగులు చేసింది. న్యూజిలాండ్ వికెట్ తేడాతో గెలిచింది.
స్కాట్లాండ్ 25.4 ఓవర్లలో 130 పరుగులు చేసింది. హోబార్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసిస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.