Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిచ్‌ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేయండి! బ్యాటింగ్‌పై దృష్టిపెట్టండి: కేపీ

To stop whining about Pitch: Kevin Pietersen urged England Coach Chris Silverwood

లండన్: డేనైట్ టెస్టు పిచ్‌పై ఇంగ్లండ్ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మంచిదికాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. సిల్వర్‌వుడ్‌ అహ్మదాబాద్ పిచ్‌ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదు చేయాలనుకోవడం ముందే ఓటమిని అంగీకరించినట్లు అవుతుందన్నాడు. అన్ని పక్కనపెట్టి చివరి టెస్టు కోసం బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని కేపీ సూచించాడు. గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవ‌లం రెండు రోజుల్లోపే ముగిసిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ మ‌రీ రెండు రోజుల్లోపే ముగియ‌డం ప‌ట్ల కొంత మంది మాజీలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

నేనైతే ఒప్పుకునేవాడిని:

నేనైతే ఒప్పుకునేవాడిని:

తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో కెవిన్ పీటర్సన్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 'ఎవరినైనా వేలెత్తి చూపితే.. మిగిలిన నాలుగేళ్లు మనవైపే చూపిస్తాయి. ఇంగ్లండ్ ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే మ్యాచ్‌లో నేనొక ఇంగ్లండ్ ఆటగాడిని అయి ఉంటే.. బాగా ఆడలేదనే విషయాన్ని ఒప్పుకునేవాడిని. తర్వాతి టెస్టుకు మరోవారం సమయం ఉండటంతో మరింత బాగా కష్టపడి ఆ మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తాననేవాడిని. ఎందుకంటే.. చివరి టెస్టు విజయం సాధించి, భారత్‌లో రెండు మ్యాచ్‌లు గెలుపొంది.. సిరీస్‌ డ్రా చేసుకోవడం మంచి విషయమే కదా' అని అన్నాడు.

పిచ్‌ను నిందించడం సరికాదు:

పిచ్‌ను నిందించడం సరికాదు:

కోచ్ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌‌ ఇప్పుడు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా, ఓటమిని అంగీకరించే స్వభావం ఉండాలని కెవిన్ పీటర్సన్‌ సూచించాడు. 'తమ ఓటమికి పిచ్‌ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేసి తర్వాతి మ్యాచ్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై దృష్టి సారించాలి. స్పిన్‌ బౌలింగ్‌కు ఎదుర్కోవడంలో ఇంకెలా మెరుగవ్వాలనే విషయాలపై గురించి ఆలోచించాలి. బ్యాటింగ్‌ విషయంలో మరింత కష్టపడాలి' అని కేపీ పేర్కొన్నాడు.

పీటర్సన్‌ ఒక్కడే సానుకూలంగా:

పీటర్సన్‌ ఒక్కడే సానుకూలంగా:

మొదటి నుంచీ పలువురు మాజీలు మూడో టెస్టు పిచ్‌ను విమర్శిస్తుండగా.. కెవిన్ పీటర్సన్‌ ఒక్కడే సానుకూలంగా స్పందించాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకొని అందికంటే బిన్నంగా తన అభిప్రాయం వెల్లడించాడు. మ్యాచ్‌ ఇలా త్వరగా పూర్తవ్వడం నిరాశ కలిగించినా.. అందుకు ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే అని పేర్కొన్నాడు. స్పిన్‌కు అనుకూలించే మొతేరా పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు తేలిపోయారన్నాడు. కేపీ వ్యాఖ్యలపై భారత స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. మమ్మల్ని మీరు ఒక్కరు మాత్రమే అర్థం చేసుకున్నారని కేపీ వీడియోకు కామెంట్‌ చేశాడు.

మార్చి 4న ప్రారంభం:

మార్చి 4న ప్రారంభం:

డేనైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా.. భారత్‌ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో మార్చి 4న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

Story first published: Tuesday, March 2, 2021, 7:55 [IST]
Other articles published on Mar 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+