అమ్మనే నా మార్గనిర్దేశకురాలు, పెద్ద విమర్శకురాలు: రవిశాస్త్రి

రాజ్‌కోట్: అమ్మనే నా మార్గనిర్దేశకురాలు, పెద్ద విమర్శకురాలు అని అంటున్నారు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. బుధవారం రవిశాస్త్రి తల్లి లక్ష్మిశాస్త్రి పుట్టినరోజు. ఈ రోజుతో లక్ష్మిశాస్త్రి 80వ ఏట ప్రవేశించారు. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఉన్న రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
'నా మార్గనిర్దేశకురాలు, అతి పెద్ద విమర్శకురాలు మా అమ్మే. హ్యపీ బర్త్‌డే మామ్. గాడ్ బ్లెస్ యూ' అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశారు. అంతేకాదు తన తల్లితో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. శాస్త్రి షేర్ చేసిన ఈ ఫొటో కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. సోషల్ మీడియా వేదికగా రవిశాస్త్రి తల్లికి అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మంగళవారం జన్మదిన వేడుకలు జరపుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి బర్త్‌డే విషెస్ తెలిపారు. కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను రవిశాస్త్రి తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ 'హ్యాప్ బర్త్‌డే యంగ్‌మ్యాన్. బ్రేక్‌ను ఎంజాయ్ చేయి. రాబోయే రోజుల్లో అద్భుతంగా ఆడాలి. దేవుడు ఆశీర్వదించుగాక. #HappyBirthdayVirat #KingKohli" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ రవిశాస్త్రి కొంపముంచింది. శాస్త్రి అంటే పడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసారు. టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన అనంతరం ప్రధానంగా రవిశాస్త్రిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. భారత్‌పై బంగ్లా తొలి టీ20 విజయాన్ని అందుకుని సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని బంగ్లా చూస్తుంటే.. విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది.
రాజ్‌కోట్ మైదానంలో భారత జట్టు రెండో టీ20 కోసం రవిశాస్త్రి పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తోంది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే రాజ్‌కోట్ వేదికగా జరిగే రెండో టీ20కి సైక్లోన్ మహా ముప్పు ఉంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications